Bhumi pednekar : బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఫ్యాషన్ గేమ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫాలో అయ్యే ఫ్యాషన్ స్టైల్స్ ఉత్తమ దశలో ఉంటాయి. భూమి ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఒక్కసారి చూస్తే ఆమె స్టైల్ లుక్స్ ను అందరూ ఫాలో అవుతారు. అందమైన లెహంగా నుండి డిజైనర్ చీరలు, ఉత్కంఠభరితమైన సూట్ సెట్‌ల వరకు, భూమి అన్నింటినీ ధరిస్తోంది అదిరిపోయే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది.
ఇన్ స్టాగ్రామ్ క్వీన్ భూమి భూమి పెడ్నేకర్ తన ఫ్యాషన్ డైరీలలోని స్నిప్పెట్‌లతో ఫ్యాషన్ ప్రియులను ఉర్రూతలూగించే పనిలో పడిపోయింది . ఈ బ్యూటీ ఇటీవల జరిగిన అవార్డుల వేడుకలో తన రెడ్ కార్పెట్ లుక్స్ నుండి కొన్ని పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.హాఫ్ వైట్ గౌన్ లో ఉన్న భూమి హాట్ పిక్స్ ఇంటర్నెట్ లో అలజడిని సృటిస్తున్నాయి.
భూమి లేటెస్ట్ ఫోటో షూట్ కోసం హాఫ్ వైట్ గౌనును ఎంచుకుంది. గోల్డెన్ థ్రెడ్స్, సీక్విన్ వివరాలను కలిగిన గౌనులో ఎంతో హాట్ గా కనిపించింది ఈ భామ . ట్రాన్స్పరెంట్ లాంగ్ ట్రైన్ అవుట్ ఫిట్ కి మెస్మరైజింగ్ లుక్ ను అందించింది.
తన రూపానికి మరిన్ని స్టైలిష్ వైబ్‌లను జోడించేందుకు ఈ భామ గౌను పైన సీక్విన్స్ వివరాలతో అలంకరించిన డిజైనర్ శ్రగ్ వేసుకుంది. అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మ్యాచ్ అయ్యేలా ఉంగరాలు పెట్టుకుని అద్భుతంగా కనిపించింది. హెయిర్ ను లీవ్ చేసి మతులు పోగొట్టింది.
భూమి తన లుక్ కు అనుగుణంగా మినిమల్ మేకప్ ఎంచుకుంది . న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ మాస్కరా వేసుకుని , కనుబొమ్మలు డార్క్ చేసి పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ వేసుకుని తన గ్లామరస్ లుక్స్ తో యూత్ ను క్లీన్ బౌల్డ్ చేసింది.