Categories: EntertainmentLatest

Bhumi Pednekar : అద్దాల రవిక, తెల్లని చీర..నేలపై చందమామ ఈ భూమి

Bhumi Pednekar : భూమి పెడ్నేకర్ తన ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఎప్పటికప్పుడు మారే ఫ్యాషన్ ట్రెండ్స్ కు అనుగుణంగా భూమి తన స్టైల్స్ ను మారుస్తుంటుంది. మోడ్రన్ దుస్తుల్లో మెస్మరైజ్ చేయాలన్నా చీరకట్టుతో మత్తెక్కెంచాలన్నా ఈ బ్యూటీకి చిటికెలో పని. మూవీస్ ద్వారా ఫేమస్ అవ్వడం కంటే ఈ భామ ఫ్యాషన్ స్టైల్స్ తోనే అధిక పాపులారిటీని సంపాదించుకుంది. ఆమె తాజా లుక్‌ అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. చీరకట్టుతో చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి.

bhumi-pednekar-glamours-looks-in-ivory-mirror-saree

బాలీవుడ్ బ్యూటీ, అందాల భామ భూమి పెడ్నేకర్ ముంబైలో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో తళుక్కుమంది. రెడ్ కార్పెట్ పై ట్రెడిషనల్ లుక్ తో దర్శనమిచ్చి అందరిని మంత్రముగ్ధులను చేసింది. భూమి అద్దాల చీర కట్టుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆకర్షణీయమైన తెల్లటి నెట్ చీరలతో అప్సరసలా అదరగొట్టింది ఈ బ్యూటీ. ఈ అవార్డు వేడుక సందర్భంగా భూమి ఈ చీరతో చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

bhumi-pednekar-glamours-looks-in-ivory-mirror-saree

భూమి పెడ్నేకర్ తన తాజా ఫోటోషూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. చిత్రాలలో, భూమి పెడ్నేకర్ ఆఫ్ వైట్ హెవీ ఎంబ్రాయిడరీ చీరలో చాలా గ్లామరస్‌గా కనిపిస్తోంది. చీరపై అందంగా తీర్చిదిద్దిన గోటా పట్టీలు , మిర్రర్ వర్క్ భూమి పెడ్నేకర్ లుక్‌కు మరింత అందాన్ని అందించాయి. ఈ చీరలో ఎంతో హాట్‌గా కనిపించింది భూమి.

bhumi-pednekar-glamours-looks-in-ivory-mirror-saree

భూమి చీరను మ్యాచింగ్ స్ట్రాప్‌లెస్ బస్టియర్ బ్లౌజ్ ఫ్లోర్ స్వీపింగ్ నెట్ కేప్‌తో స్టైల్ చేసింది. అద్దం అలంకారాలు, గుచ్చుతున్న స్వీట్‌హార్ట్ నెక్‌లైన్, మిడ్‌రిఫ్-బేరింగ్ హేమ్ తో బ్లౌజ్‌ను అందంగా డిజైన్ చేశారు. సీ-త్రూ కేప్‌లో సీక్విన్డ్ పూసల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

bhumi-pednekar-glamours-looks-in-ivory-mirror-saree

చివరగా, తన కురులతో మధ్య పాపిట తీసి కొప్పు చుట్టుకుంది. ఈ చీరకు తగ్గట్లుగా భూమి న్యూడ్ మేకప్ ను ఎంచుకుంది. పెదాలకు న్యూడ్ లిప్ షేడ్, బోల్డ్ వింగేడ్ ఐలైనర్, స్మోకీ ఐ షాడో పెట్టుకుని తన లుక్ ను గ్లామరస్‌గా మార్చుకుంది. మెడలో ఆకర్షణీయమైన సిల్వర్ చోకర్ నెక్‌లెస్‌ను అలంకరించుకుని అందరిని అట్రాక్ట్ చేసింది భూమి.

bhumi-pednekar-glamours-looks-in-ivory-mirror-saree
Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

1 day ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

2 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

3 weeks ago

This website uses cookies.