Tulasi Leaves: తులసి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఆరోగ్య పరంగాను అలాగే ఆధ్యాత్మిక పరంగాను తులసి ఆకులను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు. ఇలా తులసి ఆకులను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు కనుక ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో తులసి కోట తప్పనిసరిగా ఉంటుంది ఇక తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రతి ఒక్కరు ఈ తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తూ ఉంటారు.
ఇలా తులసి చెట్టును పూజించడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయని ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని భావిస్తుంటారు. ఇలా ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్క రెండు ఆకులను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కింద పెట్టుకోవడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి తులసి మొక్క ఆకులను దిండు కింద పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే..
తులసి ఆకులను దిండు కింద పెట్టుకొని పడుకోవటం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతికూలత తొలిగిపోతుంది అలాగే మీ మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనలు కూడా తొలగిపోతాయి.మీ మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా తులసి ఆకులను దిండు కింద ఉంచితే మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుందట. ఏదైనా మానసిక అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడితే అది కూడా పోతుందని చెబుతున్నారు. అంతేకాకుండా, కోపాన్ని నియంత్రించడంలో కూడా ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.దిండు కింద తులసి ఆకును ఉంచడం వల్ల గ్రహాలు కూడా ప్రశాంతంగా ఉంటాయట. గ్రహాల నుండి లభించిన అశుభం తొలగిపోవడం ప్రారంభమవుతుందట. గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అయితే వీటిని ఒక ఎర్రని వస్త్రంలో పెట్టి దిండు కింద పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.