Chicken Liver: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా చికెన్ ఎంతో అమితంగా ఇష్టపడుతూ తింటూ ఉంటారు ముక్క లేనిదే ముద్ద దిగదు అంతలా చికెన్ ఇష్టపడుతూ ఉంటారు. అయితే చాలామంది చికెన్ తినేటప్పుడు ఎక్కువగా లివర్ తినడానికి ఏమాత్రం ఇష్టపడరు చికెన్ లివర్ తినడం వల్ల ఫాట్ ఎక్కువగా ఉంటుందని భావించి చికెన్ లివర్ పూర్తిగా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అయితే ఇలా చికెన్ లివర్ కనుక పక్కన పెడుతున్నట్టు అయితే మీరు ఎన్నో ప్రయోజనాలు కోల్పోయినట్టేనని చెప్పాలి.
చికెన్ లివర్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండి ప్రోటీన్లు అధికంగా ఉంటుంది ముఖ్యంగా బి 12 విటమిన్ ఇందులో అధికంగా ఉంటుంది ఎవరైతే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారికి చికెన్ లివర్ లో పుష్కలంగా ఐరన్ లభిస్తుంది ఐరన్ తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా విరివిగా లభిస్తుంది. ఇక చికెన్ లివర్ లో యాంటీ ఇన్ఫర్మేషన్ బ్యాక్టీరియల్ ఏజెంట్ అధికంగా ఉంటాయి కనుక ఈ లివర్ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
ముఖ్యంగా గర్భం దాల్చిన మహిళలకు పోలిక్ యాసిడ్ ఎంతో అవసరం పోలిక్ యాసిడ్ తో పాటు ఐరన్ కూడా అవసరం కనుక లివర్ తీసుకోవడం వల్ల ఈ పోషక విలువలను మనం పొందవచ్చు. అయితే చికెన్ లివర్ లో ఎక్కువగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అని రోజు చికెన్ లివర్ తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు వారంలో రెండు మూడుసార్లు తగినంత మోతాదులో చికెన్ లివర్ తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.