Betel Leaves: మన హిందూ సంప్రదాయాల ప్రకారం తమలపాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏదైనా పూజ కార్యక్రమం చేయాలి అంటే ముందుగా తమలపాకులు తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతే కాకుండా చాలా మంది భోజనం చేసిన తర్వాత తమలపాకులు నమలడం అలవాటుగా ఉంటుంది ప్రస్తుత కాలంలో ఈ అలవాట్లు చాలా మంది తగ్గించుకున్నారు. కానీ ఒకప్పుడు భోజనం చేసిన వెంటనే తమలపాకును నమ్ముతూ ఉండేవారు.
ఇలా తమలపాకు అటు ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇటు ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది అయితే ప్రతిరోజు తమలపాకును నమలటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి తమలపాకు నమలవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..
చాలామందికి వేడి సమస్య కారణంగా ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అలా ముక్కలో రక్తంకారే వారు తమలపాకును తరచూ తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. తమలపాకులో ఉన్నటువంటి పోషకాలు రక్తం గడ్డ కట్టడానికి ఎంతగానో దోహదం పడతాయి. తద్వారా గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం అధికంగా కాదు.తమలపాకు బ్యాక్టీరియాతో పోరాడుతుంది. కాబట్టి మొటిమలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలను ఇట్టే నివారిస్తుంది.ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో తమలపాకులు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తమలపాకును రోజూ తినడం వల్ల కీళ్లనొప్పులు నయం అవుతాయి. తమలపాకును క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇక తమలపాకులను గ్లాసు నీటిలో మరిగించి ఆ పానీయం తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ రేటు పెరగడమే కాకుండా జలుబు సమస్య నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.