Health Tips: మనందరికీ ఇష్టమైన తీగ జాతి కాయకూరల్లో బీరకాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. బీరకాయలో సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ బి కాంప్లెక్స్,కాల్షియం, ఐరన్ ,పొటాషియం , మాంగనీస్ పీచు పదార్థం, అమైనో ఆమ్లాలు వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభించడమే కాకుండా మన ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వు పదార్థం,సోడియం తక్కువ పరిమాణంలో బీరకాయ ప్రత్యేకత.
ముఖ్యంగా బీరకాయ తొక్కలో ఉన్నటువంటి శక్తివంతమైన ఆక్సిడెంట్లు,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి, ఫైబర్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గించి మనలో ఇమ్యూనిటీ బూస్టర్ గా సహాయపడుతుంది. అందుకే బీరకాయను తొక్క తీయకుండా ఆహారంలో వినియోగించిన చాలా మంచిది. బీరకాయలు సమృద్ధిగా లభించే ఫైబర్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని నియంత్రిస్తుంది. బీరకాయలో సమృద్ధిగా విటమిన్ బి12, మెగ్నీషియం లభిస్తుంది కావున నాడీ కణ వ్యవస్థను, మెదడు కండరాలను ఉత్తేజపరిచి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది
బీరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. బీరకాయలో లభించే అత్యధిక నీటి లవణాలు డిహైడ్రేషన్ సమస్యను తొలగిస్తాయి.
బీరకాయలో లభించే అత్యధిక పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచి మలబద్ధక సమస్యని తొలగించి ఒంట్లో చెడు వ్యర్ధాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది.