Beerakaya:కూరగాయలలో తీగ జాతికి చెందినటువంటి వాటిలో బీరకాయలకు చాలా ప్రాముఖ్యత ఉందివేసవి కాలంలో కాస్త అర్థం గా లభించే బీరకాయలు చలికాలంలో చాలా విరివిగా లభిస్తాయి.ఎలా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఈ బీరకాయలను తరచు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బీరకాయలో సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ బి కాంప్లెక్స్,కాల్షియం, ఐరన్ ,పొటాషియం , మాంగనీస్ వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభించడమే కాకుండా మన ఆరోగ్యానికి హాని కలిగించే కొవ్వు పదార్థం,సోడియం తక్కువ పరిమాణంలో ఉండటమే బీరకాయ ప్రత్యేకత.
ముఖ్యంగా బీరకాయ తొక్కలో ఉన్నటువంటి శక్తివంతమైన ఆక్సిడెంట్లు,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ సి, ఫైబర్ శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గించి మనలో ఇమ్యూనిటీ బూస్టర్ గా సహాయపడుతుంది. అందుకే బీరకాయను తొక్క తీయకుండా ఆహారంలో వినియోగించిన చాలా మంచిది. బీరకాయలు సమృద్ధిగా లభించే ఫైబర్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని నియంత్రిస్తుంది.
బీరకాయలో సమృద్ధిగా విటమిన్ బి12, మెగ్నీషియం లభిస్తుంది కావున నాడీ కణ వ్యవస్థను, మెదడు కండరాలను ఉత్తేజపరిచి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది
Beerakaya:
బీరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. బీరకాయలో అధిక మొత్తం నీటి శాతం కలిగి ఉండటం వల్ల ఇది డిహైడ్రేషన్ సమస్య నుంచి మనల్ని బయటపడేలా అదేవిధంగా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు రోజువారి డైట్ లో బీరకాయను తింటే ఇందులో అత్యధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థం, ఖనిజలవనాలు రక్తనాళాలు, పొట్ట భాగంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగించి ఉబకాయ సమస్యను తగ్గిస్తుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు సమస్యల నుంచి కూడా మనల్ని బయటపడేస్తుంది. ఇలా బీరకాయ ఆరోగ్యానికి ఎంతో కీలకమని చెప్పాలి.