Banana Leaf: అరటి ఆకుల భోజనం చేయడానికి ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టపడుతుంటారు.అదే ఏదైనా పండుగలు ప్రత్యేకత రోజులు గనక వస్తే చాలామంది అరటి ఆకులలోనే భోజనం చేస్తుంటారు కానీ పూర్వంలో అలా కాదు భోజనం చేసిన ప్రతిసారి అరటి ఆకులోనే భోజనం చేసేవారు. అరటి ఆకుల భోజనం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.గతంలో వారికి ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలియకపోయినా అరిటాకులు అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువగా అరటి ఆకులను భోజనం చేసేవారు.
ఇకపోతే అరటి ఆకులో భోజనం చేయడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే… అరటి ఆకులు మనకు ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి.అలాగే ఎన్నో పోషకాలు కూడా అరటి ఆకులో ఉన్నాయి మనం వేడి అన్నం వడ్డించుకున్నప్పుడు ఆకు మొత్తం రంగు మారుతుంది అందులో ఉన్నటువంటి పోషకాలు మన ఆహారంలోకి వచ్చినప్పుడే రంగు మారుతుందని అర్థం.
Banana Leaf:
ఇలా వేడివేడి ఆహార పదార్థాలను అరిటాకులో వడ్డించుకుని తినడం వల్ల ఆకులలో ఉన్నటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆంటీ క్యాన్సర్ కారకాలు మన శరీరంలోకి వెళ్లడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. అంతేకాకుండా మనపై ఎవరైనా విష ప్రయోగం చేసిన వెంటనే అరిటాకు దానిని కనిపెడుతుంది. మనపై ఎవరైనా విష ప్రయోగం చేస్తే ఆహార పదార్థాలు మొత్తం రంగు మారుతాయి. అందుకే పూర్వకాలంలో రాజులు లేదా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారు కేవలం అరటి ఆకులలో మాత్రమే భోజనాలు చేసేవారు.ఇలా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు.