Balakrishna : తెలుగునాట తిరుగులేని ఫాలోయింగ్ బాలకృష్ణ సొంతం. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ లో పూనకాలు మొదలవుతాయి. గాడ్ ఆఫ్ మాసెస్ ఆయన ఇమేజ్ అల్టిమేట్. తన నటనతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో మూవీస్, క్యారెక్టర్స్ చేశారు బాలయ్య. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను మెప్పించే ఎన్నో చిత్రాల్లో నటించారు. మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్ అనేలా ఆయన సినిమాలను అందించారు. గత కొంత కాలంగా వరుస విక్టరీలతో దూసుకుపోతున్న బాలకృష్ణ మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన 109వ చిత్రంగా NBK10తో మాస్ ని అలరించడానికి డైరెక్టర్ బాబీ తో జోడీ కట్టారు.
బాలయ్య ఈ న్యూ ప్రాజెక్ట్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఇవాళ బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస తెలుపుతూ స్పెషల్ గ్లింప్స్ ను రెడీ చేశారు. జాలి, దయ, కరుణ వంటి పదాలకు అర్థం తెలియని అసురుడుఅంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలయ్య క్యారెక్టర్ ను ఇంట్రడ్యూజ్ చేశారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం ఫ్యాన్స్ లో కొత్త ఊపును తీసుకొస్తోంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ తన సినిమాల్లో హీరోలను పవర్ ఫుల్ గా చూపిస్తుంటాడు. ఫ్యాన్స్ మెచ్చేలా ఆయన క్యారెక్టర్లు ఉంటాయి. NBK109లో కూడా బాలకృష్ణ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. చూడటానికి స్టైలిష్ గా ఉన్నా, అసలుసిసలైన వయలెన్స్ చూపించే క్యారెక్టర్ లో బాలకృష్ణను చూడబోతున్నాం.
NBK109కు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో వీరిద్దరి పనితనం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. విజయ్ కార్తీక్ విజువల్స్ అందరినీ కట్టి పడేస్తున్నాయి. థమన్ సంగీతం వేరే లెవెల్ లో ఉంది. ప్రముఖ బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు.