Avantika Vandanapu: హాలీవుడ్ హీరోయిన్ గా మెరుస్తున్న ఈ తెలుగమ్మాయి ఎవరో తెలుసా?

Avantika Vandanapu: ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి హాలీవుడ్ రేంజ్ లో మన సినిమా ఖ్యాతిని పెంచాడు. ఈ సినిమా ద్వారా హాలీవుడ్ దర్శకుల దృష్టి ఇండియాపై పడేలా చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఇండియన్ యాక్టర్స్ ఈ మధ్యకాలంలో హాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంకా చోప్రా హాలీవుడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక దీపికా పదుకునే కూడా హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక రాధికా ఆప్టే కూడా హాలీవుడ్ సినిమాలలో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే హిందీలో సక్సెస్ అయిన తెలుగు భామ శోభిత దూళిపాళ్ళ కూడా హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అక్కడ దేవ్ పటేల్ తో ఒక సినిమా చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో తెలుగమ్మాయి హాలీవుడ్ లో వెబ్ సిరీస్ లో ఎంట్రీ ఇచ్చింది.
avantika-vandanapu-in-hollywood-movies
ఇప్పుడు మరో తెలుగమ్మాయి అవంతిక వందనాపు హాలీవుడ్ సినిమాలో మెయిన్ లీడ్ కి ఎంపికైంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ నుంచి వస్తున్నా మీన్ గర్ల్ అనే సినిమాతో ఆమె టైటిల్ రోల్ కి ఎంపికైంది. దీంతో ఇప్పుడు అవంతిక పేరు హాట్ న్యూస్ గా మారిపోయింది. ఆంధ్రా ఎన్నారై ఫ్యామిలీకి చెందిన ఈ అమ్మడు అమెరికాలో ఉంది. ఇక ఈమె ఇప్పటికే టాలీవుడ్ లో చైల్డ్ యాక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో నటించింది. అందులో చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో కనిపించింది. అలాగే నాగచైతన్య ప్రేమమ్ సినిమాలో మూడో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించింది. అలాగే రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో కూడా చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో అవంతిక నటించింది.
avantika-vandanapu-in-hollywood-movies
తెలుగు సినిమాలలో చైల్డ్ యాక్టర్ గా చేసిన అవంతిక ఇక్కడ ఇండియన్ క్లాసికల్ డాన్స్ లో కూడా మంచి ప్రావీణ్యం ముంది కూచిపూడి నృత్యం కూడా నేర్చుకుంది. అలాగే డాన్స్ రియాలిటీషోలకూడా ఈ అమ్మడు సత్తా చాటింది. ఇదిలా ఉంటే ఆమె చివరిగా అజ్ఞాతవాసి సినిమాలో తెలుగులో నటించింది. అలాగే తమిళ్ మూవీ భూమికలో కూడా ఐశ్వర్య రాజేష్ చెల్లెళ్ళు పాత్రలో కనిపించింది. ఇదిలా ఉంటే ఆమె స్పిన్ అనే హాలీవుడ్ మూవీతో అక్కడ మెయిన్ లీడ్ లో నటిగా అడుగుపెట్టింది. తరువాత సీనియర్ ఇయర్, ఏ క్రౌన్ ఆఫ్ విషెస్ అనే హాలీవుడ్ సినిమాలలో నటించింది. అలాగే డిస్నీ హాట్ స్టార్ లో మూడు వెబ్ సిరీస్ లలో నటించింది. ఇప్పుడు ఏకంగా పారామౌంట్ పిక్చర్స్ నిర్మించే మీన్ గర్ల్స్ మూవీలో మెయిన్ లీడ్ కి ఎంపికైంది. దీంతో అవంతిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
Varalakshmi

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

2 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

7 days ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.