Tuesday: వారంలో ఒక వారం ఒక్కో గ్రహానికి అంకితం చేయబడింది. ఇలా మంగళవారం మాత్రం అంగారకుడికి అంకితం చేయబడింది. అంగారక గ్రహం ఎప్పుడు కూడా రౌద్రంతో ఉంటుంది. అంగారక గ్రహాన్ని హానికరమైన గ్రహంగా భావిస్తారు. ఒకరి జాతకంలో బలహీనమైన స్థితిలో ఉన్న మార్స్, జీవితంలో ఆ వ్యక్తికి ఎప్పుడూ కష్టాలను తెస్తుందని భావిస్తుంటారు. ఇలా మన జాతకంలో అంగారక గ్రహ ప్రభావం ఉంది అంటే తప్పనిసరిగా హనుమంతుడిని మంగళవారం పూజించటం వల్ల ఈ గ్రహ దోషాలు తొలగిపోతాయని భావిస్తారు. ఇక మంగళవారం హనుమంతుడిని ప్రత్యేకంగా పూజించడమే కాకుండా పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి మంగళవారం ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయానికి వస్తే..
మంగళవారం మీరు పొరపాటున కూడా మేకప్ కి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీ దాంపత్య జీవితంలో గొడవలు జరుగుతాయట.మంగళవారం రోజున పొరపాటున కూడా సేవింగ్ గోర్లు కత్తిరించడం లాంటివీ అస్సలు చేయకూడదు. మంగళవారం గోర్లు కత్తిరించడం అవమానకరంగా భావిస్తారు.మంగళవారం రోజు ఎప్పుడు కూడా ముదురు రంగు దుస్తులు కొనుగోలు చేయడం ధరించడం లాంటివి చేయకూడదట. ఇంకా చెప్పాలంటే ఈ రోజున ఎర్ర బట్టలు ధరించడం చాలా మంచిదని చెబుతున్నారు.
ఇక భూమిని అంగారకుడికి కొడుకుగా భావిస్తారు కనుక మంగళవార సమయంలో ఎలాంటి దుక్కి దున్నడాలు అలాగే భూమిని తవ్వడం వంటివి చేయకూడదు. మంగళవారం తలుపు తట్టడం కూడా శుభంగా పరిగణించబడదు. అలాగే మంగళవారం రోజు పదునైన వస్తువులు కొనుగోలు చేయకూడదు. మాంసం తినకూడదట. ఉపవాసం ఉన్నవారు ఉప్పును అస్సలు తినకూడదని చెబుతున్నారు. ఇక మంగళవారం ఎట్టి పరిస్థితులలో కూడా అప్పు చేయకూడదని పండితులు చెబుతున్నారు.