Tech: ఈ అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు మరెన్నో నక్షత్రాలు ఉన్నాయి అనే సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ విశ్వంలో గ్రహాలు అన్ని గురుత్వాకర్షణ శక్తితోనే అలా తిరుగుతూ ఉంటాయి. ఈ గ్రహాలతో పాటు ఎన్నో గ్రహ శకలాలు కూడా ఉన్నాయి. అయితే మనకి తెలిసి ఈ భూమి మీద మాత్రమే జీవం ఉనికి ఉందని భావిస్తారు. అయితే ఖగోళం ఎన్నో మరెన్నో గ్రహాలు ఉన్న నేపధ్యంలో కచ్చితంగా మనలాంటి మనుషులు లేదంటే అంతకంటే అడ్వాన్స్ గా ఉండే జీవులు ఉండే అవకాశాలు మాత్రం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ఖగోళంలో గ్రహాలతో పాటు గ్రహ శకలాలు కూడా ముక్కలుగా తిరుగుతూ ఉంటాయి. విస్పొటనాలు సంభవించినపుడు గ్రహ శకలాలు వేరుపడి విశ్వంలోకి వస్తాయి.
అవి అలా ప్రయాణం చేసి కొన్ని వందల సంవత్సరాలకి ఏదో ఒక గ్రహాన్ని తాకుతాయి. అలా తాకే సమయంలో ఊహించని విపత్తులు సంభవిస్తాయి. కొన్ని శకలాలు అయితే ఒక పట్టణం అంత పరిణామంలో ఉండగా మరికొన్ని శకలాలు ఒక దేశం లేదంటే ఖండం అంత పరిణామంలో ఉంటాయి. అవి కాని భూమిని తాకితే ఇక సంభవించే ఉపద్రవం అంచనా వేయడం ఎవరితరం కాదు. కోట్లాది మంది ప్రజలతో పాటు జీవులు కూడా తుడుచుకుపెట్టుకుపోతాయి. అలాంటి ఒక గ్రహశకలంతో భవిష్యత్తులో భూమికి విపత్తు రాబోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డీజెడ్2 అనే గ్రహ శకలం భూమి, చంద్రుడి కక్ష్య మధ్యలో ప్రయాణం చేస్తుందని దీంతో ఆకాశంలో ఓ ఖగోళ అద్భుతం చోటు చేసుకుంటుంది.
ఇది భూమికి 1,68,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తోంది. ఇది భూమి చంద్రుల మధ్య దూరం కన్నా సగమే. గ్రహ శకలాలు భూమికి దగ్గరగా రావడం అరుదుగా జరుగుతుంది. కాబట్టి దీనిపై పరిశోధన చేస్తున్నారు. దీని పరిమాణం 40-90 మీటర్ల మధ్య ఉంటుందని అంచానా. ఈ గ్రహశకలం సూర్యడి చుట్టూ ఓ భ్రమణం చేయడానికి 3.16 ఏళ్లు తీసుకుంటుంది. ఇది 2026లో మరోసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఆ తరువాత 2029లో భూమికి మరింత దగ్గర వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాని పరిభ్రమణంలో ఏమైనా మార్పులు జరిగితే భూమిని తాకే అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం డైనోసరాస్ అంతం కావడానికి కూడా ఇలా గ్రహశకలం భూమిని తాకడమే అని భావిస్తున్నారు.