Eating Chicken: చికెన్ అంటే ఇష్టపడని వారు ఉండరనే చెప్పాలి. చాలామంది తమ రోజు వారి ఆహారంలో భాగంగా చికెన్ తినడానికి ఇష్టపడతారు. అయితే చికెన్ కేవలం రోజు ఉడికించుకొని తినడం కంటే ప్రతిరోజు ఒక్కో విధంగా తయారు చేసుకొని తింటూ ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో చాలామంది గ్రిల్డ్ చికెన్ తినడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇలా గ్రిల్డ్ చికెన్ తినడం వల్ల ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి చికెన్ తినడం వల్ల అందులో ఉన్నటువంటి ప్రోటీన్లు మన శరీరానికి ఎంతో మంచి ఆరోగ్యాన్ని కల్పిస్తాయి. ఇలా ఆరోగ్యానికి మంచిది కదా అని ప్రతిరోజు చికెన్ తింటే మాత్రం అది అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని చెప్పాలి. ఇకపోతే గ్రిల్డ్ చికెన్ తినడం వల్ల ఇది మన శరీరంలోని క్యాన్సర్ కణాలను ప్రేరేపించడానికి కారణమవుతుందని తద్వారా క్యాన్సర్ బారిన పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే గ్రిల్డ్ చికెన్ ఎక్కువగా తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇక చికెన్ ఎప్పుడూ కూడా ఇలా డీప్ ఫ్రై చేయడం కాల్చినవి తినడం కంటే కూడా బాగా ఉడికించి తినడం వల్ల అందులో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా కూడా పూర్తిగా నశించిపోయి మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి. అయితే వారంలో ఒకటి లేదా రెండు సార్లు చికెన్ తీసుకోవడం మంచిది కానీ ప్రతిరోజు చికెన్ తీసుకోవడం వల్ల మనం తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.