Friday: సాధారణంగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కావడంతో పెద్ద ఎత్తున శుక్రవారం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం పూజలు చేస్తూ ఉంటారు. శుక్రవారం మన ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకొని పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి అమ్మవారు మనపై అనుగ్రహం చూపిస్తారని అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా మనల్ని వెంటాడవని భావిస్తూ ఉంటారు. అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు.
శుక్రవారం అమ్మవారిని పూజించేవారు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు పొరపాటున ఇలాంటి తప్పులు కనుక చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉండదని పండితులు చెబుతుంటారు ముఖ్యంగా దానధర్మాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. శుక్రవారం పొరపాటున కూడా తెలుపు రంగు వస్తువులను దానం చేయకూడదు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఈ విధమైనటువంటి రంగు వస్తువులను దానం చేయకపోవడం మంచిది.
శుక్రవారం ఏ సమయంలోనో తెలుపు రంగు వస్తువులు అయినటువంటి బియ్యం పంచదార ఉప్పు వంటి వాటిని దానం చేయకూడదు. వీటితోపాటు శుక్రవారం అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అదేవిధంగా ఇతరుల పట్ల పరుష పదాలు మాట్లాడకుండా ఉండాలి. శుక్రవారం ఎవరితోనో గొడవలు కూడా పడకూడదు. ఇతరులతో మాట్లాడే సమయంలో కూడా చాలా సమయమనం పాటించాలి. ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలి అంటే శుక్రవారం ఈ విధంగా నడుచుకోవడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.