Petrol Price News: ఇంత దారుణంగా పెట్రోల్ ధరలు పెరగనున్నాయా?

Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్ ధర 105 డాలర్ల మార్కును దాటిపోవడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా సామాన్యుడిపై భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదే తరుణంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన వ్యాఖ్యలు పెట్రో మంటపై క్లారిటీ ఇచ్చాయి.

రాష్ట్ర ఎన్నికల కోడ్ ముగియడంతో చమురు సంస్థలు ధరల సవరణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ లోపు పెట్రోల్ ధర లీటరుకు ఏకంగా రూ. 5 వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాలపై స్పందించిన మంత్రి పురి.. ధరల పెరుగుదల అన్నది పూర్తిగా మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని, దానికి ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా ధరలను నియంత్రించగలిగామని, కానీ ప్రస్తుత ప్రపంచ సంక్షోభం ఒక పెద్ద సవాల్ అని ఆయన పేర్కొన్నారు.

are-petrol-prices-going-to-rise-this-much

Petrol Price News: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆందోళన.!

చమురు విక్రయ సంస్థలు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా రేట్లు పెంచకపోవడం వల్ల ఈ సంస్థలు రోజుకు రూ. 1,000 కోట్ల మేర నష్టపోతున్నాయని ఆయన వివరించారు. ఈ త్రైమాసికంలో నష్టాల విలువ ఏకంగా రూ. 1 లక్ష కోట్లకు చేరడంతో, కంపెనీల మనుగడ కోసం ధరల పెంపు దిశగా అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది.

ధరల పెంపుపై ఆందోళన నెలకొన్నప్పటికీ, ఇంధన కొరత విషయంలో మంత్రి సానుకూల ప్రకటన చేశారు. ప్రధాని మోదీ దూరదృష్టితో దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో 69 రోజులకు సరిపడా ముడి చమురు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 54,000 టన్నులకు పెంచినట్లు వివరించారు. ఏది ఏమైనా, రానున్న వారం రోజులు వాహనదారులకు అత్యంత కీలకంగా మారనున్నాయి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

4 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

4 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.