Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి తిరిగి తన విధుల్లో చేరబోతున్నారు. అనారోగ్యం కారణంగా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో పాలనపై దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. కేవలం పార్టీ శ్రేణుల్లోనే కాకుండా, ప్రభుత్వ యంత్రాంగంలోనూ పవన్ రాక ఒక కొత్త ఊపును తీసుకొస్తోంది.
నేడు ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్ కల్యాణ్ గన్నవరం బయలుదేరారు. ఉదయం 10:40 గంటలకు ఆయన ఏపీ గడ్డపై అడుగుపెట్టనున్నారు. అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు జనసైనికులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వరకు రోడ్డు మార్గంలో ఆయన ప్రయాణం సాగనుంది. ఈ క్రమంలో దారిపొడవునా జనసేనానిపై పూలవర్షం కురిపించేందుకు అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు.
పవన్ కల్యాణ్ గైర్హాజరీలో పలు శాఖల పనులు నెమ్మదించాయని భావిస్తున్న తరుణంలో, నేడు ఉదయం 11:30 గంటలకు కార్యాలయానికి చేరుకోగానే ఆయన కీలక సమీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను పరిష్కరించడమే కాకుండా, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్త పర్యటనలకు కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.
కాగా, ఎన్నికల తర్వాత పవన్ తనదైన ముద్ర వేస్తూ పాలనలో బిజీగా మారారు. మధ్యలో వచ్చిన ఈ చిన్న గ్యాప్ తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఏ ఏ అంశాలపై ఆయన ఫోకస్ పెట్టబోతున్నారు? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా, డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ అనే వార్త జనసేన శ్రేణుల్లో మాత్రం కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.