AP POLITICS: పవన్ Vs ప్రొఫెసర్: కథ మళ్లీ మొదటికొచ్చింది..!

AP POLITICS: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ – ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం ఒక పట్టాన తేలేలా కనిపించడం లేదు. కాకినాడలో నమోదైన కేసుతో మొదలైన ఈ రగడ.. రాజమండ్రి పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌తో ముగిసిపోయిందని అంతా భావించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం తెలంగాణ డీజీపీని కలిసి, తాను ఇప్పటికే వివరణ ఇచ్చేశానని, ఇక ఈ వివాదానికి ఎండ్ కార్డ్ పడినట్లేనని సంకేతాలు ఇచ్చారు. కానీ, సీన్ కట్ చేస్తే కథ అసలైన మలుపు తిరిగింది. వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న తరుణంలో హైదరాబాద్ వేదికగా జరిగిన పరిణామాలు ఈ వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తీసుకువచ్చాయి.

తెలంగాణ మేధావులు, సీనియర్ జర్నలిస్టులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌లో అత్యవసరంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఈ వివాదానికి సరికొత్త రంగు పులిమింది. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు సంఘీభావం ప్రకటించిన ఈ మేధావుల సదస్సు.. నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రజాస్వామ్య దేశంలో విమర్శించే హక్కును, భావప్రకటన స్వేచ్ఛను పోలీసు కేసులతో అణచివేయాలని చూడటం సరికాదని వారు హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలను తట్టుకోవాలని, అంతేకానీ బెదిరింపులకు దిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

ap-politics-pawan-vs-professor-the-story-comes-to-the-fore-again

AP POLITICS: పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం

ఈ సమావేశంలో కేవలం కేసుకు సంబంధించిన విషయాలే కాకుండా, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కూడా పదునైన విమర్శలు వచ్చాయి. ఒకప్పుడు చెగువేరా ఆదర్శాలంటూ మాట్లాడిన పవన్.. నేడు చంద్రబాబు నాయుడి వ్యూహాల చుట్టూ తిరుగుతున్నారంటూ కొందరు సీనియర్ జర్నలిస్టులు ఎద్దేవా చేశారు. పవన్ వ్యక్తిగత జీవితాన్ని సైతం ఈ చర్చలోకి లాగుతూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, గతంలో ఎన్టీఆర్‌కు జరిగిన వెన్నుపోటు ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆంధ్రా నాయకత్వం హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ తెలంగాణ విశ్లేషకులపై ఇటువంటి అణచివేత చర్యలకు పాల్పడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ సదస్సులో ప్రొఫెసర్ నాగేశ్వర్ తన గళాన్ని మరింత పెంచారు. ప్రభుత్వం తనపై మోపిన కులాల, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారనే ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “నేను ముప్పై ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడే జైళ్లకు, అరెస్టులకు భయపడలేదు.. ఇప్పుడు 62 ఏళ్ల వయసులో వెనక్కి తగ్గుతానా?” అంటూ పవన్ కళ్యాణ్ వైఖరిపై విరుచుకుపడ్డారు. తన ప్రాణం పోయినా అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం ఆపనని, ధైర్యముంటే తనను అరెస్ట్ చేసుకోవచ్చని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఒక ప్రభుత్వమే పౌరుల భావస్వేచ్ఛను అడ్డుకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి పవన్ పీస్ ఫుల్ గా ఈ వివాదాన్ని ముగించాలని చూసినా.. ఈ తాజా పరిణామాలు ఈ పొలిటికల్ వార్‌ను మరికొన్నాళ్లు సజీవంగా ఉంచేలా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ వివాదం ఏ తీరానికి చేరుతుందో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

13 hours ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

15 hours ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

This website uses cookies.