AP POLITICS: వైసీపీకి అసలు ఆ హక్కు ఉందా.. అమరావతిలో రచ్చ.!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి వైపు కన్నెత్తి చూడని వైసీపీ, ఇప్పుడు అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షం కావడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. నాడు మూడు రాజధానుల ముసుగులో అమరావతిని పూర్తిగా పక్కనబెట్టిన జగన్ పార్టీ, ఇప్పుడు అక్కడ పర్యటించేందుకు సిద్ధమవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని సెంటిమెంట్‌ను దెబ్బతీసిన వైసీపీకి, అసలు అమరావతి మట్టిపై అడుగుపెట్టే నైతిక హక్కు ఉందా అంటూ ప్రజాసంఘాలు, కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.

తాజాగా అమరావతి పరిధిలో భూముల సేకరణ, రైతుల ఇబ్బందులంటూ వైసీపీ ఒక ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలతో కూడిన ఈ బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడమే ఆలస్యం.. ఉండవల్లి సెంటర్ వద్ద సీన్ ఒక్కసారిగా మారిపోయింది. “గో బ్యాక్ వైసీపీ” అంటూ కూటమి సానుభూతిపరులు, స్థానిక రైతులు భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి వైసీపీ నేతల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. మాటల యుద్ధం కాస్తా తోపులాటగా మారడం, వైసీపీ వాహనాలపై రాళ్ల దాడి జరగడంతో తాడేపల్లి పరిసర ప్రాంతాలు క్షణాల్లో రణరంగంగా మారాయి.

 

ap-politics-does-the-ycp-even-have-that-right-uproar-over-amaravati

AP POLITICS: మావిగాన్ అంటూ కొత్త రాగాలు అందుకుంటున్న వైసీపీ..

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి గ్రామాలు ఎదుర్కొన్న నిర్బంధాలు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబుకు ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోననే సంకుచిత ఆలోచనతోనే వైసీపీ ఆనాడు రాజధాని పనులను నత్తనడకన నడిపించిందని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి నిరంతరం సాగాలన్న కనీస సూత్రాన్ని విస్మరించి, ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకున్నారనే కోపం అమరావతి ప్రజల్లో ఇంకా చల్లారలేదు. ఇప్పుడు రెండో విడత భూముల పేరుతో కొంతమందిని వైసీపీ ఆఫీసుకు రప్పించుకుని, అమరావతి పరిరక్షణ కమిటీలంటూ డ్రామాలు ఆడటంపై రాజధాని రైతులు మండిపడుతున్నారు.

ఇక రాజధాని ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే ప్రశ్నించే హక్కు ఏ ప్రతిపక్షానికైనా ఉంటుంది. కానీ, అసలు అమరావతిపై వైసీపీ అధికారిక స్టాండ్ ఏంటో చెప్పకుండా ఇలాంటి పర్యటనలు చేయడం వల్లే ఈ రచ్చ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటివరకు మూడు రాజధానులు అని, ఇవాళ మావిగాన్ అంటూ కొత్త రాగాలు అందుకుంటున్న వైసీపీ.. ముందుగా అమరావతి విషయంలో ఏపీ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. లేనిపక్షంలో, రాజధాని గ్రామాల్లో అడుగుపెట్టిన ప్రతిసారీ వైసీపీ నేతలకు ఇలాంటి చేదు అనుభవాలు, తీవ్ర ప్రతిఘటన తప్పవనేది తాజా ఘటనతో స్పష్టమవుతోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.