Film Updates: నాగబంధం vs రావు బహదూర్.. ఈ వారం మహా పరీక్ష..!

Film Updates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం యుద్ధం జరగడం మామూలే. కానీ ఈ వారం రాబోతున్న రెండు సినిమాలు మాత్రం కేవలం కలెక్షన్ల కోసమే కాదు, తమ ఉనికిని చాటుకోవడానికి, విమర్శకుల నోళ్లు నొక్కడానికి వస్తున్నాయి. ఒకవైపు దైవిక శక్తులు, నిధుల వేట నేపథ్యంలో సాగే హై-బడ్జెట్ అడ్వెంచర్ ‘నాగబంధం’… మరోవైపు మైండ్ గేమ్‌లతో సాగే ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. ఈ రెండు భిన్న ధృవాల లాంటి సినిమాలు ఈ వారం థియేటర్లలో తలపడబోతున్నాయి. అయితే ఈ పోటీ కేవలం సినిమాల మధ్య మాత్రమే కాదు, వీటి వెనుక ఉన్న నలుగురి కెరీర్‌లకు ఇదొక మహా పరీక్ష.

ముందుగా నటుల విషయానికి వస్తే, వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్‌కు ఇండస్ట్రీలో మంచి నటుడిగా తిరుగులేని గుర్తింపు ఉంది. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాయి. కేవలం విమర్శకుల ప్రశంసలు మాత్రమే సరిపోవు, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి బాక్సాఫీస్ నెంబర్స్ కూడా ముఖ్యమే అని నిరూపించాల్సిన పరిస్థితి సత్యదేవ్‌ది. అందుకే ‘రావు బహదూర్’ ఆయనకు అత్యంత కీలకంగా మారింది. ఇక మరో హీరో విరాట్ కర్ణ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా ఉంది. భారీ అంచనాలతో వచ్చిన తొలి సినిమా ‘పెద కాపు’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. అయినా సరే, ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అయ్యేలా ఆయన రెండో సినిమా ‘నాగబంధం’ కోసం దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. ఒక ప్లాప్ హీరోపై ఇంత భారీ పందెం కాసిన మేకర్స్ నమ్మకాన్ని విరాట్ ఈసారి నిలబెడతాడా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

film-updates-nagabandham-vs-rao-bahadur-the-ultimate-test-this-week

Film Updates: అసలైన ఉత్కంఠ అంతా దర్శకుల మధ్యే నడుస్తోంది.

హీరోలను పక్కన పెడితే, అసలైన ఉత్కంఠ అంతా దర్శకుల మధ్యే నడుస్తోంది. ముఖ్యంగా ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంతో మేధావిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మహాకు ఈ వారం కత్తిమీద సామే. గతంలో కమర్షియల్ సినిమాలను, ప్రేక్షకుల అభిరుచులను తక్కువ చేస్తూ ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ నెగిటివిటీని తెచ్చిపెట్టాయి. ‘రావు బహదూర్’తో ఆయన ఏం మ్యాజిక్ చేస్తాడో చూద్దాం అని ఒక వర్గం నెటిజన్లు కాచుకుని కూర్చున్నారు. ఈ సినిమా గనుక తేడా కొడితే ట్రోలర్స్‌కు అడ్డంగా బుక్కైపోవడం ఖాయం. అందుకే వెంకటేష్ మహా తనలోని కమర్షియల్ సత్తాను నిరూపించుకోవడానికి ఇది ఒక పెద్ద పరీక్ష.

మరోవైపు, నిర్మాతగా ఇండస్ట్రీలో పట్టున్న అభిషేక్ నామా ‘నాగబంధం’ చిత్రంతో పూర్తిస్థాయి దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో కొన్ని సినిమాలకు తెర వెనుక ఆయన ఇన్పుట్స్ ఉన్నప్పటికీ, డైరెక్టర్‌గా ఆయన విజన్ ఏంటో తేలాల్సింది ఈ వంద కోట్ల ప్రాజెక్ట్‌తోనే. తొలి ప్రయత్నంలోనే ఇంత భారీ కాన్వాస్‌ను ఆయన ఎలా హ్యాండిల్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. ప్రమోషన్ల పరంగా ఇరు చిత్రబృందాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. కంటెంట్ పరంగా ఎవరి బలాలు వారికి ఉన్నాయి. మరి ఈ మహా పరీక్షలో గెలిచి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచేది ఎవరో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.