Anushka Shetty-UV Creations: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ వారికి ఇకపై దూరంగా ఉండబోతుందా..? ఆ సంస్థలో సినిమాలు చేయడానికి నో చెప్పేసిందా..? ప్రస్తుతం ఇదే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ప్రభాస్ కి సంబంధించిన ఈ నిర్మాణ సంస్థను ఆయన స్నేహితుడు, రిలేటివ్ నడుపుతున్నారు. ప్రభాస్ నిర్ణయం మేరకే ఈ నిర్మాణ సంస్థలో ఏ సినిమా రూపొందాలన్నా.
అనుష్క అంటే ప్రభాస్ కి ఎంతటి ఇష్టమో, గౌరవమో అందరికీ తెలిసిందే. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గత కొన్నేళ్ళుగా సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీ వర్గాలలోనూ చక్కర్లు కొడుతూ ఉంది. కానీ, దీనిపై ఇప్పటి వరకూ అటు ప్రభాస్ నుంచి ఇటు అనుష్క నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే, ఇటీవలే ప్రభాస్ పెద్దమ్మ త్వరలో ప్రభాస్ పెళ్ళి పీటలెక్కబోతున్నాడని, బంధువుల అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడని హింట్ ఇచ్చారు.
దీంతో సోషల్ మీడియాలో కొత్త టాక్ వినిపిస్తోంది. అనుష్క ని గనక ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఇక ఆయనకి ఆయన నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయించున్నదని. దీనిలో ఎంత వరకూ వాస్తవముందో తెలియదు గానీ, ఇప్పుడు మాత్రం ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికే అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ‘మిర్చి’, ‘భాగమతి’, ‘మిస్ శెట్టి మిసెస్ పోలిశెట్టి’ చిత్రాలు చేసింది.
ప్రభాస్ అంటే అనుష్కకి విపరీతమైన ఇష్టం. ఇద్దరు పెళ్లి చేసుకుంటే బావుంటదనే మాట అభిమానులు, ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు అనుకున్న మాట వాస్తవమే. కానీ, దీనికి ప్రభాస్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదనేది లోలోపల వినిపిస్తున్న మాట. చూడాలి మరి చివరికి ప్రభాస్ అనుష్క మెడలో తాళి కడతాడా లేక పెద్దమ్మ చెప్పినట్టే బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా. కాగా, ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘సలార్’ విడుదలకి సిద్ధమవుతోంది. ‘కల్కి’ చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే మరో సినిమా చేయాల్సి ఉంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.