Anup Rubens: సినిమా ఇండస్ట్రీలో అదృష్టం కంటే కూడా కొన్నిసార్లు టాలెంట్ అవకాశాలు వచ్చేలా చేస్తుంది. దీనిని కొందరు దేవుడి దయ అని నమ్ముతుంటారు. ఏదేమైనా కష్టే ఫలి. మనసుపెట్టి కష్టపడితే సక్సెస్, పాపులారిటీ, డబ్బు అవే వస్తాయని అనుభవజ్ఞులు చెబుతుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇతర భాషలలో కూడా వెనక ఎవరో ఒకరు ఉంటేనే సక్సెస్ అవుతుంటారు.
కొంతమంది హీరోలు, వాళ్ల బ్యాక్‌గ్రౌండ్ చూస్తే ఇది అర్థమవుతుంది. కానీ, ఇప్పుడు మంచి సంగీత దర్శకుడిగా పాపులర్ అయిన అనూప్ రుబెన్స్ మాత్రం కష్టపడే ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన క్రిష్టియన్. ప్రతీ ఆదివారం చర్చీలలో పాటలు పాడేవారు. అలాగే ఆ పాటలకి తగ్గట్టుగా కీ బోర్డ్ ప్లే చేస్తుండేవారు. ఆయన గొంతు వినడానికి బావుంటుంది. సింగర్ గా మంచి లైఫ్ ఉందని చాలామంది సలహా ఇచ్చేవారు.
Anup Rubens: తేజ దృష్ఠిలో పడ్డాడు అనూప్ రుబెన్స్.
అలా కొత్త వారికి అవకాశం ఇచ్చే దర్శకుడు తేజ దృష్ఠిలో పడ్డాడు అనూప్ రుబెన్స్. ఆయన దర్శకత్వంలో వచ్చిన జై, ధైర్యం సినిమాలకి సంగీతం అందించాడు. ఈ రెండు సినిమాలు మ్యూజికల్ గా మంచి హిట్ సాధించాయి. ఆ తర్వాత అనూప్ నుంచి ద్రోణ, నేను నా రాక్షసి, ప్రేమ కావాలి, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్, మనం, పైసా వసూల్, సోగ్గాడే చిన్ని నాయన లాంటి బ్లాక్ బస్టర్ వచ్చాయి.
ఒకప్పుడు చక్రి సినిమా మ్యూజికల్ గా ఎంతటి హిట్ సాధించేదో అనూప్ రుబెన్స్ మ్యూజిక్ అందించిన సినిమాలు అలా సక్సెస్ సాధిస్తూ వచ్చాయి. అంతేకాదు, చాలా స్పీడ్‌గా 50 సినిమాలు పూర్తి చేసిన ఘనత అనూప్ కి దక్కింది. మణిశర్మ, ఎస్ ఎస్ థమన్, దేవీశ్రీప్రసాద్, గోపీ సుందర్, అనిరుధ్ లాంటి వారు ఉన్నా అనూప్ రుబెన్స్ కి మాత్రం మంచి సినిమాలకి సంగీతం అందించే అవకాశాలు ఇస్తున్నారు. ఇక్కడ టాలెంట్ ఉండాలేగానీ, అనూప్ మాదిరిగా ఎంతో మంది జెండా ఎగరేయవచ్చు.