Home Tips: సాధారణంగా మనం మన ఇల్లు శుభ్రంగా ఉండడం కోసం ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటాము అయినప్పటికీ ఇంట్లో బొద్దింకలు చీమలు, నల్ల ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం బయట వాతావరణంలో మార్పులు రావటం వల్ల ఎక్కువగా నల్లటి ఈగలు ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇంటిని ఎంత శుభ్రం చేసినప్పటికీ ఈ ఈగల బెడద మాత్రం తగ్గడం లేదు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈగల బెడద తగ్గకపోతే ఈ సింపుల్ చిట్కాని ఉపయోగిస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
మన ఇంట్లో ఈగలను చీమలను బొద్దింకలను తరిమికొట్టాలి అంటే ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో నాలుగు లవంగాలను వేసి బాగా మరిగించాలి. నీళ్ల రంగు మారేవరకు మరిగించాలి అయితే ఇలా మరిగిన నీటిలోకి రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేయాలి. ఇలా బేకింగ్ సోడా వేయగానే ఒక్కసారిగా నురుగు పొంగినట్టు అవుతుంది కానీ ఎవరు భయపడాల్సిన పనిలేదు ఇలా బేకింగ్ సోడా వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమంలోకి రెండు బిర్యానీ ఆకులను తుంచి వేయాలి. ఇక ఈ నీటిని
ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. అనంతరం ఈ నీటితో కిటికీల వెంట గోడల దగ్గర అలాగే మూలల్లో స్ప్రే చేయటం వల్ల ఈ వాసనకు ఈగలు బొద్దింకలో ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండవు. ఇక బల్లులు కూడా ఇంటి నుంచి పరారు అవుతాయి. ఈ సింపుల్ చిట్కా వల్ల ఏ విధమైనటువంటి హానికర పరిస్థితులు కూడా తలెత్తవు.