Anjali : తెలుగమ్మాయి అంజలి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక్కడ అమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో తన సత్తాను చూపించుకొని ఇప్పుడు ఆ తర్వాత తెలుగులో అవకాశాలను దక్కించుకుంది. ఈ బావ నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ టాక్ వచ్చినప్పటికీ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకో లేకపోయింది. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ తనకున్న కాస్త క్రేజ్ ను కాపాడుకుంటుంది. ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత మరోసారి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీతో అలరించేందుకు రెడీ అయింది అంజలి. 2014లో గీతాంజలి మూవీతో భయపెట్టిన ఈ అంజలి మరోసారి భయపెట్టేందుకు సిద్ధమైంది. నిన్ను కోరి మూవీ కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈమధ్యనే మూవీకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటి అంజలి, టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్ట్రెస్ శ్రీ లీల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నటి అంజలి తాజాగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే మూవీలో నటించింది. ఈ మూవీ త్వరలో తెర ముందు విడుదల కాకపోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ ఈ మధ్యనే పోస్టర్ రిలీజ్ చేశారు. లేటెస్ట్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మూవీ ముచ్చట్లు పంచుకున్నారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్ట్ అంజలిని ఉద్దేశిస్తూ ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు అంజలి తన ఎక్స్పీరియన్స్ తో మంచి సమాధానం చెప్పింది.’ తెలుగు ప్రేక్షకులకు మీరంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం అయితే మీకు ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదనిపిస్తోంది. తెలుగు అమ్మాయి అవడం వల్ల అవకాశాలు రావడం లేదా? లేకపోతే కారణాలు ఏమైనా ఉన్నాయా? నిన్న మొన్న వచ్చిన శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళ్తోంది కానీ మీకు ఎందుకంత గ్యాప్ వస్తోంది? అని ఓ విలేకరి ప్రశ్నించింది.
దీనికి అంజలి రిప్లై ఇస్తూ” నిజంగా నాకు బ్రేక్ రాకపోతే నేను మీకు అభిమాన నటి అయ్యేదాన్నే కాదు. నేనెప్పుడూ ఇండస్ట్రీలో ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉండాలని కోరుకోలేదు. ప్రతి డైరెక్టర్ కి నేను నచ్చాలని లేదు ఒక్కో డైరెక్టర్ కి ఒక్కొక్కరు నచ్చుతారు. నాకు కథ నచ్చితేనే నేను చేస్తాను. అందులో నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటేనే సినిమా చేస్తాను లేకపోతే దానికి ఒప్పుకోను. కావాలనుకుంటే నేను మూడు నుంచి నాలుగు సినిమాలు చేయొచ్చు కానీ నాలుగు సినిమాలు చేయడం కంటే ఒక మంచి సినిమా చేయడం అనేది నా ఉద్దేశం. నేను తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ నటిస్తున్నాను ఒకేసారి అన్నిచోట్ల నేను ఉండలేను కదా. అక్కడో సినిమా ఇక్కడో సినిమా చేస్తున్న. అందులోనూ నాకు నచ్చిన క్యారెక్టర్స్ ని మాత్రమే ఎన్నుకుంటున్నాను.