Wed. Jan 21st, 2026

    Anchor Anasuya: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా తో సూపర్ సక్సెస్ అందుకొని గీతా గోవిందం మూవీతో స్టార్ స్టేటస్ ని విజయ్ దేవరకొండ సొంతం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ గత ఏడాది లైగర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ఖుషి మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ది విజయ్ దేవరకొండ అని ఉంది.

    Telugu Actress, Anasuya Bharadwaj Takes Another Dig At The 'Liger' Actor,  Vijay Devarakonda

    అర్జున్ రెడ్డి సినిమా నుంచి స్టార్ యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన అనసూయ, విజయ్ దేవరకొండతో గొడవ పడుతూనే ఉంది. ఆ సినిమా విషయంలో లైవ్ డిబేట్ లో కూడా పార్టిసిపేట్ చేసి విమర్శలు చేశారు. గతంలో చాలా సందర్భాల్లో విజయ్ దేవరకొండపై అనసూయ తన కోపాన్ని ప్రదర్శించారు. లైగర్ మూవీ ఫ్లాప్ అయినప్పుడు ట్విట్టర్ లో తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఖుషి పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు విషయంలో అనసూయ ట్విట్టర్ లో విమర్శిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ది నాన్సెన్స్ ఇప్పుడే చూశా. ఇలాంటి పైత్యానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తా అంటూ పోస్ట్ చేశారు.

    Anasuya Bharadwaj corners Vijay Deverakonda and his movie 'Liger'

    ఇలా విమర్శలు చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమెపై సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.  అనసూయని దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తనపై వచ్చిన విమర్శలకు ఆమె కూడా గట్టిగానే రియాక్ట్ కావడం విశేషం. ఇలా ఈరోజు ట్విట్టర్ లో అనసూయ వెర్షస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనే విధంగా రచ్చ నడుస్తూనే ఉంది. అనసూయ కావాలని రెచ్చగొట్టి వివాదం సృష్టించి అటెన్సన్ గ్రాబ్ చేసుకుంటుంది అనే విమర్శలు సోషల్ మీడియాలో దేవరకొండ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. మరి ఈ ట్విట్టర్ వార్ అనసూయ, రౌడీ స్టార్ ఫ్యాన్స్ మధ్య ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి.