Ananya Pandey : అనన్య పాండే కజిన్ అలన్నా పాండే పెళ్లి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తన చిరకాల ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది అలన్న. సోహైల్ ఖాన్ ముంబై నివాసంలో అలన్నా మెహందీ వేడుక జరిగింది. ఈ జంటను ఆశీర్వదించడానికి బాలీవూడ్ సినీ ప్రముఖులు తరలిరావడంతో వేదిక స్టార్ల తో మెరిసిపోయింది.

అనన్య పాండే తల్లి భావనా పాండేతో కలిసి అద్భుతమైన ఎత్నిక్ డ్రెస్ లో అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది పెళ్లి లో చిక్ ,సూపర్ స్టైలిష్‌గా ఎలా కనిపించాలో నోట్స్ తీసుకునేలా చేసింది ఈ బ్యూటీ .

అనన్య ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది.ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో క్రమం తప్పకుండా ఫ్యాషన్ ఇన్‌స్పోను పంచుకుంటూ ఫ్యాన్స్ ను మెస్మెరైజ్ చేస్తుంది. క్యాజువల్ నుండి ఫార్మల్ వరకు , పండుగ ఆవు ట్స్ వరకు, అనన్య ఫ్యాషన్ డైరీలు విభిన్నమైనవిగా ఉంటాయి. తాజాగా ఈ బ్యూటీ కజిన్ పెళ్ళిలో క్లిష్టంగా రూపొందించిన వోగ్యుష్ బేబీ పింక్ బ్రాలెట్‌ను వేసుకుని, దానికి మ్యాచింగ్ గా అదే రంగులో ఉన్న స్కర్ట్ ధరించి ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను అందిస్తోంది. అనన్య అందమైన లుక్స్‌తో మెరిసిపోయింది.

సొహైల్ ఖాన్ నివాసం లోపలికి వెళ్లే ముందు బయట ఛాయాచిత్రకారులు కోసం ఓపికగా పోజులిచ్చిన అనన్య చాలా అందంగా కనిపించింది. అనన్య సిల్వర్ థ్రెడ్‌లలో భారీ ఎంబ్రాయిడరీ వర్క్‌ను కలిగి ఉన్న సొగసైన , భారీ అలంకార వివరాలతో , మినిమల్ స్లిప్ బ్లౌజ్‌లో ఏంటో క్యూట్ గా కనిపించింది. ఈ బ్లౌజ్ ఆమె టోన్డ్ మిడ్‌రిఫ్‌ను చూపిస్తూ ఆమె ఆకారాన్నికౌగిలించుకుంది. అనన్య బ్లౌజ్‌ను పాస్టెల్ పింక్ లాంగ్ , ఫ్లూ స్కర్ట్‌తో జత చేసింది.

అనన్య హైహీల్స్, పూల ఆకారపు పెర్ల్ డ్రాప్ చెవిపోగులు, స్టేట్‌మెంట్ రింగ్‌తో తన దుస్తులను యాక్సెసరైజ్ చేసింది. అనన్య గజిబిజి పోనీటైల్ లో ఏంటో ముద్దుగా కనిపించింది. కనులకు సొగసైన ఐలైనర్, మెరిసేటి ఐ షాడో వేసుకుని పేదలకు న్యూడ్ పింక్ లిప్ షేడ్ దిద్దుకుని కుర్రళ్ళ దృష్టిని తనవైపు తిప్పుకుంది.
