Health Tips: సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం లేవగానే అల్పాహారాన్ని కంటే ముందుగానే బ్రష్ చేస్తుంటాము ఇలా బ్రష్ చేయడం వల్ల నోటిలో ఉన్నటువంటి క్రిములు మొత్తం తొలగిపోయి ఎంతో తాజాగా ఉంటుంది అయితే చాలామంది ఉదయం మాత్రమే బ్రష్ చేసే అలవాటు చేసుకునే ఉంటారు. ఇక మరికొందరు రాత్రి పడుకోవడానికి ముందు కూడా బ్రష్ చేసి పడుకుంటారు. ఇలా పడుకోవడానికి ముందుగా బ్రష్ చేయటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేసి పడుకోవటం వల్ల దంత క్షయాన్ని నివారించడంలో సహాయపడుతుంది. రాత్రి భోజనం నుండి నోటిలో ఉండే ఏదైనా ఆహార కణాలు లేదా చక్కెర లాంటి ఆహార ప్రాంతాలు శుభ్రం చేస్తాయి చాలామంది చిగుళ్ల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా చిగుళ్ళ సమస్యను నివారించడానికి రాత్రిపూట బ్రష్ చేయడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రాత్రిపూట పళ్ళు తోముకోవడం వల్ల బ్యాక్టీరియా మరియు చిగుళ్ల వ్యాధుల నుండి బయటపడవచ్చు. ఈ చిన్న పని చిగుళ్ల వ్యాధిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది. చిగుళ్ల వ్యాధులను నివారించడమే కాకుండా, రాత్రిపూట బ్రష్ చేయడం వల్ల నోరు తాజాగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు నిమిషాల పాటు బ్రష్ చేయటం వల్ల దంతాలు ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చు. ఇక బ్రష్ చేయడం మంచిది కదా అని ఎక్కువసేపు బ్రష్ చేయటం వల్ల పళ్లపై ఉన్నటువంటి ఎనామిల్ పొర దెబ్బతిని మొదటికి మోసం వస్తుంది కనుక రెండు నిమిషాలు అధికంగా ఒత్తిడి లేకుండా పళ్ళను తోమటం ఎంతో మంచిది.