Allu Arjun: అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజు కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘ఆర్య’ 2004లో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ యువతలో విపరీతంగా ట్రెండ్ అయింది. రూ.6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ సినిమా రూ.35 కోట్ల వసూళ్లను రాబట్టి భారీ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంతో అప్పుడే కెరీర్ ప్రారంభించిన బన్నీ అందుకు ఎంత పారితోషికం తీసుకున్నాడన్న విషయంపై తాజాగా నిర్మాత శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శిరీష్ చెప్పిన విధంగా.. “ఆర్య సినిమా షూటింగ్ మొదలయ్యే సమయంలోనే అల్లు అర్జున్ పారితోషికం గురించి అల్లు అరవింద్ గారిని అడిగాం. అయితే ఆయన మొదట చెప్పలేదు. సినిమా పూర్తయ్యాక మళ్లీ అడిగినా సమాధానం ఇవ్వలేదు. దీంతో ఎంత పారితోషికం అడుగుతారో తెలియక టెన్షన్ పట్టేసింది,” అన్నారు.
తర్వాత సినిమాను ప్రసాద్ ల్యాబ్ లో ప్రివ్యూలో చూపించాక కూడా అల్లు అరవింద్ గారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయారని తెలిపారు. చివరికి దిల్ రాజు గారు వారి ఇంటికి వెళ్లి మళ్లీ అడిగినప్పుడు, అరవింద్ గారు ఇలా చెప్పారు.. “నైజాంలో వసూలు ఒక కోటి అయితే ₹10 లక్షలు ఇవ్వండి, రెండు కోట్లు అయితే ₹20 లక్షలు. ఐదు కోట్లు వసూలు అయితే ₹40 లక్షలు చాలు. యాభై లక్షలు వద్దు. అదే బన్నీ పారితోషికం.”
ఈ మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారట. నిర్మాతల కష్టాలను అర్థం చేసుకున్న అల్లు అరవింద్, అలాగే అల్లు అర్జున్ నిర్మాతల పట్ల ఎంతో గౌరవం చూపించారని శిరీష్ చెప్పారు. “బన్నీ డౌన్ టు ఎర్త్ పర్సన్. నిర్మాతల పరిస్థితిని అర్థం చేసుకొని సహకరిస్తారు. అందుకే ఈ స్థాయికి చేరుకున్నారు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇదంతా చూస్తుంటే, స్టార్ హీరోలు మొదటి దశలో ఎలా కష్టపడి ఎదిగారో స్పష్టమవుతుంది. అల్లు అర్జున్ లాంటి నటులు నిర్మాతలతో చూపే నిబద్ధత, గౌరవం కారణంగానే ఈరోజు పరిశ్రమలో నిలిచారు అనే విషయం మరోసారి రుజువైంది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.