Categories: EntertainmentLatest

Allu Arjun : పుష్ప- 3 కూడా ఉందా? బన్నీ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్

Allu Arjun : పుష్ప సినిమా విడుదలై మూడేళ్లు అవుతోంది. పుష్ప ప్రాంచైస్ కాకుండా బన్నీ మరో ప్రాజెక్టుకు సైన్ చేయలేదు. ప్రస్తుతం బన్నీ ధ్యాస మొత్తం పుష్ప2 మీదే ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కాబోతోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీ తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ అందించాడు. బెర్లిన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పుష్ప సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ న్యూస్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

allu-arjun-crazy-update-on-pushpa-3

జర్మనీలో నిర్వహించిన ప్రెస్టీజియస్ బెర్లిన్ ఫెస్టివల్​కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఫిబ్రవరి 15 నుంచి 25వరకు జర్మనీలో ఆ ఫెస్టివల్ జరుగనుంది. ఈ క్రమంలో 74వ బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బన్నీ కూడా భాగం అయ్యాడు. సుకుమార్‌ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప మూవీకి ఇంటర్నేషనల్ వైడ్ గా క్రేజ్ లభించింది. భారత్‌లో ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అవార్డులను, ప్రశంసలను అందుకుని రికార్డులను బ్రేక్ చేసింది. తాజాగా పుష్పా మూవీ బెర్లిన్ ఫెస్టివల్​లోనూ సందడి చేసింది.

allu-arjun-crazy-update-on-pushpa-3

ఈ ఫెస్టివల్‌లో ‘పుష్ప’ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ మూవీ ప్రదర్శన పూర్తైన తర్వాత బన్నీ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ మేకర్స్, మార్కెటింగ్‌ స్ట్రాటజిస్ట్‌లతో కాసేపు మాట్లాడారు. ఆపై భారతీయ సినిమా ప్రాముఖ్యత, హిస్టరీ గురించి పలు అంశాలపై అల్లు అర్జున్‌ మాట్లాడారు. ఈ క్రమంలో పుష్ప పార్ట్‌ -3 గురించి బన్నీ క్రేజీ అప్డేట్ అందించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే పుష్ప 3 కూడా ఉండొచ్చని ఈ మూవీని ఓ ఫ్రాంచైజీలా తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు బన్నీ చెప్పాడు.

ఇంకా పుష్ప 2 రిలీజ్ కాకముందే పుష్ప3పై ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున బన్నీ ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచాడు. రెండో భాగం రిలీజయ్యాక మూడో భాగం గురించి అనౌన్స్ మెంట్ రావచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తువన్నారు. అయితే బన్నీ ఇప్పటకే త్రివిక్రమ్‌, సందీప్‌ రెడ్డి వంగా సినిమాను సైన్ చేశాడు. బోయపాటి శ్రీనుతో కూడా ఒక ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడని సమాచారం. ఈ టైంలో మరి పుష్ప-3 రావడం అంత ఈజీ కాదని తెలుస్తోంది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.