Categories: LatestNewsPolitics

Pawan Kalyan: ఈ నాలుగు రోజులు ఫోకస్ అంతా జనసేనాని మీదనే

Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో కీ లీడర్ గా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు సినిమా షూటింగ్ లు చేసుకొని మళ్ళీ రాజకీయ ప్రయాణంలోకి అడుగుపెట్టి జనసేన ఆవిర్భావ సభ నిర్వహించడానికి రెడీ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ మీద ఇన్ని రోజులు ఫోకస్ చేయని మీడియా మొత్తం మరల అతని వైపు దృష్టి పెట్టింది. దీనికి కారణం జనసేన అధినేత ఈ నలుగు రోజుల ప్రయాణంలో ఆయన రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఒక స్పష్టత రాబోతుంది. ఇక శనివారం మంగళగిరి కార్యాలయానికి చేరుకునే పవన్ కళ్యాణ్ బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. తరువాత పార్టీ నాయకులతో మరుసటి రోజు మీటింగ్ ఉంటుంది. అదే సమయంలో కాపు నేత హరిరామజోగయ్య కూడా పవన్ కళ్యాణ్ ని కలుస్తారు.

all-are-focusing-on-pawan-kalyan-in-these-4-days

అనంతరం  ఫ్యూచర్ ప్లాన్ గురించి పార్టీ నాయకులతో చర్చించి రాజకీయ కార్యాచరణపై వారికి దిశానిర్దేశ్యం చేస్తారు. అనంతరం జనసేన ఆవిర్భావ సభలో పాల్గొంటారు. ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ చాలా కీలక అంశాలని ప్రస్తావించే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. గత కొంత కాలంగా ఏపీ రాజకీయాలలో జనసేనాని చుట్టూ మీడియా చాలా ప్రశ్నలు సృష్టించి వదిలేసింది. అలాగే అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా జనసేన పవన్ కళ్యాణ్ సమాధానాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గ్లోబల్ సమ్మిట్ పై ఎలాంటి కామెంట్స్ చేయని జనసేనాని ఆవిర్భావ సభలో ఏమైనా ప్రస్తవిస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరో వైపు టీడీపీ ఓ వైపు పవన్ కళ్యాణ్ తో పొత్తు అంటూనే కాపు నాయకులని మెల్లగా పార్టీలోకి లాగుతుంది. వారితో బలం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇలా వ్యూహాత్మక విధానాలతో పవన్ కళ్యాణ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ సమాధానం కోసం, ఆయన చేసే కార్యాచరణ కోసం వేచి చూస్తున్నారు. దీంతో ఈ నాలుగు రోజులు మీడియాతో పాటు అన్ని పార్టీల దృష్టి పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఉంటుంది అనేది అందరూ చెప్పే మాట.

Varalakshmi

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.