Boiling Egg: సాధారణంగా ఉడకబెట్టిన కోడుగుడ్డు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం మనకు తెలిసిందే. ఉడకబెట్టిన కోడిగుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇది మన శరీరానికి ఎన్నో పోషక విలువలను అందించడమే కాకుండా మన శరీరానికి కావాల్సినటువంటి రోగనిరోధక శక్తిని కూడా అందిస్తుంది. ఇలా గుడ్లు ఆరోగ్యానికి మంచిది కావడంతో ప్రతిరోజు ఒక గుడ్డును తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే చాలామంది ఉదయమే గుడ్లు ఉడకపెట్టి సాయంత్రం తింటూ ఉంటారు. అలా తినడం మంచిది కాదని కొందరు భావిస్తుంటారు మరి ఉడకబెట్టిన గుడ్డును ఎంత లోపలకి తినాలి ఆలస్యంగా తింటే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…
ఒక గంట నుంచి రెండు గంటల వ్యవధిలోపు తినేసేయాలి అలా కాకుండా పొద్దున ఉడకపెట్టిన గుడ్లు సాయంత్రానికి తినడం వల్ల ఆ గుడ్డు పై ఇతర బ్యాక్టీరియాలు వచ్చి చేరుతాయి తద్వారా ఆ గుడ్లను మనం తినటం వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది అందుకే ఉడకపెట్టిన కోడిగుడ్డు ఒక గంట లేదా రెండు గంటల వ్యవధిలోపు తినడం మంచిది. ఇక చాలామంది ఒకేసారి ఎక్కువ మోతాదులో గుడ్లను ఉడకపెట్టి ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటూ ఉంటారు.
ఇలా ఉడకబెట్టిన కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో కనుక నిలువ చేసుకున్నట్లు అయితే గుడ్డు పెంకు తీయకుండా గుడ్డు పైభాగం మొత్తం తేమ ఆరిపోయేలా ఉన్న తర్వాత వాటిని ఒక సపరేట్ బాక్స్ లో పెట్టి ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు. ఇలా నిలువ చేసుకున్నటువంటి గుడ్లను కూడా మూడు రోజుల వ్యవధిలోకి తినేసేయాలి. ఇకపోతే ఉడుక పెట్టిన కోడిగుడ్లు కొన్నిసార్లు పగులుతూ ఉంటాయి అలాంటి వాటిని పొరపాటున కూడా ఫ్రిజ్లో నిల్వ చేయకూడదు. ఇలా పగిలిపోయిన గుడ్డును ఫ్రిజ్లో నిలువ చేయడం వల్ల ఫ్రిజ్లో ఉన్నటువంటి ఇతర ఆహార పదార్థాలకు కూడా పెద్ద మొత్తంలో బ్యాక్టీరియా సోకే అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి వాటిని స్టోర్ చేయకూడదు.