Aditya-L1 : సూర్యుని సీక్రెట్స్ ను బయటపెట్టడమే లక్ష్యంగా ప్రయోగించిన భారత తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 సక్సెస్ ఫుల్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. భూకక్ష్యలోకి వెళ్లిన ఆదిత్య కక్ష్యను ఆదివారం విజయవంతంగా శాస్త్రవేత్తలు అధికం చేశారు. ఉపగ్రహం ప్రస్తుతం 245× 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి వెళ్లినట్లు ఇస్రో తాజాగా ప్రకటించింది.
కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ కంట్రోల్ రూమ్ నుంచి ఆదిత్య ఎల్ 1 కక్ష్యను పంచారు. ఈ నెల 5వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలను కక్ష్యను మరోసారి ఇస్రో పెంచనుంది. 125 రోజుల్లో భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనున్న ఆదిత్య ఎల్ 1, లగ్రాంజ్ 1 పాయింట్‌లో ప్రవేశించి భానుడినిపై పరిశోదనలు చేయనుండి.
శ్రీహరికోట నుంచి శనివారం పీస్‌ఎల్‌వీ-సి57 రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లిన ఈ శాటిలైట్ 63 మినిట్స్ జర్నీ చేసి నిర్దేశిత భూ కక్ష్యలోకి వెళ్లింది. 16 రోజులు భూకక్ష్యలో తిరిగిన తర్వాత భూమికి 15 లక్షల కి.మీ. దూరంలోఎల్1 బిందువువైపు ట్రావెల్ చేస్తుంది. 1480 కేజీల బరువున్న ఆదిత్య ఎల్ 1లో ఏడు రీసెర్చ్ ఎక్విప్మెంట్ పంపారు. భానుడి పైపొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌లలో సంభవించే సోలార్ స్టార్మ్స్ , జ్వాలను, రేణువులను పరిశీలిస్తుంది. చంద్రయాన్ 3 ప్రాజెక్టు సక్సెస్ కావడంతో ఇస్రో ప్రతిష్టాత్మకంగా 2008లో పురుడుపోసుకున్న ఆదిత్య ప్రాజెక్టును రెట్టింపు ఉత్సాహంతో చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ టెక్నికల్ గా సాయం అందిస్తోంది.