Actress Rambha: దర్శకనిర్మాతలకి సీనియర్ హీరోయిన్ పర్సనల్‌గా మెసేజ్..ఇక ఊరుకుంటారా..?

Actress Rambha: దర్శకనిర్మాతలకి సీనియర్ హీరోయిన్ రంభ పర్సనల్‌గా మెసేజ్ చేసిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దివ్య భారతి నటించిన తొలిముద్దు సినిమాలో రంభ నటించింది. ఈ సినిమా షూటింగ్ పెండింగ్ ఉండగా దివ్య భారతి హఠాత్తుగా మృతి చెందింది. దాంతో అదే పోలికలతో ఉన్న రంభని పెట్టి మిగిలిన భాగం చిత్రీకరణ పూర్తి చేశారు. ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ కి తెలుగు స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం చేశారు.

అచ్చ తెలుగమ్మాయి అయిన రంభ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు. కుర్ర హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, రాజశేఖర్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల వరకూ సౌత్‌లో దాదాపు అందరితోనూ నటించింది. సీనియర్ దర్శకులు కె రాఘవేంద్ర రావు లాంటి వారితోనూ పనిచేసింది. రంభ లో ఉన్న మంచి గుణం అందరితో కలిసిపోవడం.

actress-rambha-senior-heroines-personal-message-to-the-directors

Actress Rambha: రంభకి అవకాశం కావాలి. నో చెప్పే ఛాన్సే లేదు.

సినిమా అంటే ప్రేమ. ఎలాంటి గ్లామర్ రోల్ అయినా చేసింది. రంగుల ప్రపంచం కాబట్టి అందాల ఆరబోతకి అడ్డు చెప్పలేదు. హీరోయిన్‌గా కెరీర్ కాస్త డౌన్ అవగానే ఎన్.టి.ఆర్ లాంటి హీరోల సినిమాలలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. అంటే రంభకి అవకాశం కావాలి. నో చెప్పే ఛాన్సే లేదు. అయితే, పెళ్లైన తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేసింది.

మళ్ళీ ఇంతకాలానికి ఈ సీనియర్ నటీమణి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయాలనుకుంటుందట. ఈ నేపథ్యంలో తనకు బాగా సన్నిహితంగా ఉండే దర్శకనిర్మాతలకి పర్సనల్‌గా మెసేజెస్ చేస్తుందట. మంచి క్యారెక్టర్ అయితే మళ్ళీ నటించాలనుకుంటున్నాను..అంటు హింట్ ఇస్తుందట. అటువైపు నుంచి పాజిటివ్‌గానే రెస్పాన్స్ వస్తుందని సమాచారం. కాని, ఫ్యాన్స్ మాత్రం కొందరు రంభని అక్క, అమ్మ పాత్రలో చూడాలంటే ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

capsicum: క్యాప్సికంను తరచూ తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా?

capsicum: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికంను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే…

24 hours ago

Vinayaka Chavithi: వినాయక చవితి రోజు చేయాల్సిన పనులు ఏంటి ఏ రంగు దుస్తులు ధరించాలి!

Vinayaka Chavithi: మన హిందువులు జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది ఈ పండుగను…

24 hours ago

Health care: వ్యాయామం చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. మీరు ప్రమాదంలో పడినట్టే!

Health care: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ పెడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

2 days ago

Ganesh Pooja: రేపే వినాయక చవితి… విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏదో తెలుసా?

Ganesh Pooja: ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక…

2 days ago

Fish: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం మంచిదేనా… తింటే బిడ్డకు ఆ సమస్య ఉండదా?

Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న…

3 days ago

Ganesh Pooja: వినాయక చవితి రోజు ఈ పువ్వుల సమర్పిస్తే చాలు.. అంతా శుభమే!

Ganesh Pooja: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి రోజున వినాయక చవితి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.…

3 days ago

This website uses cookies.