Actress Laya: సినిమా కోసం బరువు పెరిగి ఉద్యోగం వదిలేసా

Actress Laya: సినిమాల నుంచి విరామం తీసుకున్న నటి లయ, నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘తమ్ముడు’తో మరోసారి తెరపైకి వస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 4న విడుదల కాబోతుంది. నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించిన లయ ఈ సినిమా కోసం చేసిన ప్రయత్నాలు, అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

‘‘ఈ కథకి ‘తమ్ముడు’ టైటిల్ పూర్తిగా సరిపోతుంది. సినిమా చూసినవాళ్లందరూ అదే అనిపిస్తుంది. నితిన్ అక్క పాత్రలో నటించానంటే గర్వంగా ఉంది. నటన పరంగా నితిన్ చాలా మెచ్యూర్డ్‌గా కనిపిస్తారు. చాలా కష్టమైన సన్నివేశాలు కూడా సునాయాసంగా చేశారు,’’ అని లయ తెలిపారు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రలు పోషించగా, దిల్ రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడిన లయ, 2023లో భారత్‌కు వచ్చిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలే ఆమెకు ‘తమ్ముడు’ అవకాశాన్ని తెచ్చిపెట్టాయంటున్నారు. ‘‘జూన్‌లో ‘తమ్ముడు’ టీమ్ నుంచి కాల్ వచ్చిందీ. కథ చెప్పగానే క్యారెక్టర్ నచ్చింది. ఈ పాత్ర కోసం బరువు పెరగాలంటూ చెప్పడంతో స్వీట్స్ తింటూ ఏకంగా 7 కిలోలు బరువు పెరిగాను,’’ అని అన్నారు.

actress-laya-i-gained-weight-for-the-movie-and-quit-my-job

Actress Laya: అమెరికాలో ఉన్న జాబ్‌కి రాజీనామా

అమెరికాలో ఉన్న జాబ్‌కి రాజీనామా చేసి, పూర్తి స్థాయిలో సినిమా కోసం తిరిగి హైదరాబాదుకు వచ్చానని లయ వెల్లడించారు. ‘‘అవకాశాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. అందుకే వచ్చిన చాన్స్‌ని వదులుకోకుండా పూర్తిగా ఫోకస్ పెట్టాను. తమ్ముడు పాత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది. నా పాత్రలో స్ట్రిక్ట్‌నెస్‌తో పాటు ఆత్మీయత, అనురాగం కూడా ఉంటుంది,’’ అన్నారు.

తాను అమెరికా నటి కాదని, పక్కా హైదరాబాద్ నటి అని స్పష్టం చేశారు లయ. ‘‘అమెరికాలో ఇల్లు ఉంది కానీ సినిమాలు చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లోనే ఉంటా. ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదు. బిజినెస్ క్లాస్ టికెట్లు, స్టార్ హోటళ్లేం వద్దు. ప్రస్తుతం శివాజీగారితో చేస్తున్న సినిమా తుది దశలో ఉంది. కొత్త కథలు కూడా వింటున్నాను,’’ అని చెప్పారు.

సినిమాలకు దూరంగా ఉన్నా, మంచి పాత్రలు వస్తే మాత్రం పూర్తిగా తానుంటానని లయ స్పష్టం చేశారు. ‘తమ్ముడు’ ఆమెకు ఒక ఎమోషనల్ రీ-ఎంట్రీగా మారింది. ఇప్పుడు ఈ సినిమా విజయాన్ని బట్టే లయ మరోసారి సినీ రంగంలో రూట్ సెట్ చేస్తుందేమో చూడాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

4 hours ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

2 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

3 weeks ago

This website uses cookies.