Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ, ఈ మూవీని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇందులో మెగాస్టార్‌కి జంటగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రస్ ప్రియమణి నటిస్తుందని తెలుస్తోంది. అలాగే, కూతురు పాత్రలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కనిపించనుందట.
ఇదే, క్రమంలో మరో క్రేజీ న్యూస్ మెగా 158కి సంబందించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటుడు, నిర్మాత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నట్టుగా ఈ వార్త సారాంశం. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ నటించబోయో కొత్త సినిమాలో బండ్ల గణేష్ కీలక పాత్రను చేయనున్నాడని ప్రచారం అవుతోంది. ఆ విషయంలో ఎలాంటి అప్‌డేట్ రానప్పటికీ, ఇప్పుడు మెగా 158లో ఛాన్స్ అందుకున్నట్టుగా లేటెస్ట్ న్యూస్.
గతంలో బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్, తీన్‌మార్ సినిమాలను నిర్మించాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో గోవిందుడు అందరివాడేలే సినిమాను నిర్మించాడు. ఆ రకంగా మెగా ఫ్యామిలీ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఇక, చిరంజీవి అంటే చెప్పడానికి మాటలే కరువు. కేవలం ఆయన్ని చూద్దామని వచ్చి..నటుడిగా, నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ ఇప్పుడు మెగా 158 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
కేవిన్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. దీని తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నిర్మాతగా చిరంజీవి ఓ సినిమాను చేయాల్సి ఉంది. అలాగే, ఈ సమ్మర్ కానుకగా విశ్వంభర మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. మొత్తానికి, చిరు లైనప్ మాత్రం సూపర్ అని చెప్పాలి. ఇలాంటి, సమయంలో ఏకంగా మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ బండ్లకి రావడం గొప్ప విషయమే. మరి, దీనిపై మేకర్స్ అధికారికంగా అప్‌డేట్ ఎప్పుడిస్తారో చూడాలి. ఇదే, నిజమైతే ఈ ట్రాలెనింగ్‌లో మెగాస్టార్ కి కథ చెప్పి నిర్మాతగా కూడా బండ్ల భారీ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకోవచ్చు. చూడాలి, మరి రానున్న రోజుల్లో ఏం జరగనుందో.
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.