Spirituality: మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో రకాల వస్తువులను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అయితే కొన్ని రకాల వస్తువులను మనం తెలిసి తెలియక కూడా కింద పెట్టకూడదు మన పురాణాల ప్రకారం ఈ వస్తువులను కింద పెట్టడం వల్ల చెడు ఫలితాలను పొందుతారని చెబుతున్నాయి. మరి శాస్త్రం ప్రకారం ఎలాంటి వస్తువులను కింద పెట్టకూడదు ఏంటి అనే విషయానికి వస్తే..
హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది. జంధ్యాన్ని తల్లిదండ్రులు, గురువులకు ప్రతి రూపంగా భావిస్తారట. అందువలన జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందట. అందుకే పొరపాటున కూడా జంధ్యం క్రింద పెట్టకూడదని పెద్దలు అలాగే శాస్త్రం చెబుతోంది.
శివలింగం అలాగే నేపాల్‌లోని గండకీ నది తీరంలో ఓ రకమైన నల్ల రాయి సాలిగ్రామంను ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టకూడదు. సాలిగ్రామంను విష్ణువుకు ప్రతిరూపమని చెబుతారు. వీటిని క్రింద పెట్టడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
దేవుడి ముందు పెట్టే దీపాలను నేలపై పెట్టరాదు. వాటిని వెలిగించినా, వేలిగించక పోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి కానీ ఎప్పుడు కూడా నేలపై పెట్టరాదు. ఇక బంగారాన్ని కూడా ఎప్పుడు కూడా నేలపై పెట్టకూడదు బంగారం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కనుక నేలపై ఉంచరాదు వీటితోపాటు శంఖాన్ని కూడా నేలపై ఉంచరాదు.