Aadikeshava Movie Review: పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నారు. 25 ఏళ్ళ నుంచి ఉన్న రికార్డులను ఉప్పెన సినిమాతో బద్ధలు కొట్టారు. అయితే, ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’ బాక్సాఫీస్ వద్ద చతికిల పడ్డాయి. అయినా ఆ సినిమాల ప్రభావం వైష్ణవ్ మీద ఏమాత్రం పడలేదు. తాజాగా నటించిన ఆదికేశవ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఖాతాలో హిట్ చేరిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి వైష్ణవ్ కి ఆదికేశవ హిట్ చిత్రమా కాదా అనేది రివ్యూలో చూద్దాం.
బాలకోటయ్య (వైష్ణవ్ తేజ్) జాబ్ సంపాదించుకునే ప్రయత్నాలలో ఉంటాడు. ఈ క్రమంలోనే ఓ కాస్మెటిక్ కంపెనీకి సీఈవోగా పనిచేస్తున్న చిత్రావతి (శ్రీలీల)తో పరిచయం అవుతుంది. తనని చూడగానే ప్రేమలో పడి అక్కడే ఉద్యోగం సంపాదిస్తాడు. అలా బాలకోటయ్యకి చిత్రావతితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. కానీ, చిత్రావతితో ప్రేమను చెప్పాలనుకున్న సమయంలో తనే బాలకోటయ్యతో తన ప్రేమ విషయాన్ని చెప్పాలనుకుంటుంది. ఇంతలో ఊహించని ట్విస్ట్.
Aadikeshava Movie Review: క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలెట్
చిత్రావతికి మరో కంపెనీ పనిచేస్తున్న సీఈవోతో చిత్రావతి తండ్రి పెళ్లి ఫిక్స్ చేస్తాడు. కంపెనీ నుంచి బాలకోటయ్య బయటకి వచ్చేస్తాడు. చిత్రావతి తండ్రితో గొడవపడతాడు. ఇక్కడ మరో ట్విస్ట్. తనికెళ్ళ భరణి వచ్చి బాలకోటయ్యతో మీ నాన్న చనిపోయాడని..నువ్వు వెంటనే బయలుదేరాలని షాకింగ్ న్యూస్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది..బాలకోటయ్య ఆదికేశవగా అవతారం ఎందుకు ఎత్తాల్సి వస్తుంది.తను ఎంతగానో ప్రేమించిన చిత్రావతిని పెళ్లి చేసుకున్నాడా లేదా, అసలు బాలకోటయ్య అమ్మా నాన్న ఎవరూ అనే ఆసక్తికరమైన విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా రొటీన్ స్టోరీగా సాగుతుంది. సరదాగా సాగే సన్నివేశాలు..శ్రీలీలతో లవ్..సాంగ్స్ అలా సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో బాలయ్య కోటయ్య ఆదికేశవగా మారిన వైనం చాలా ఆసక్తిగా ఉంటుంది. అప్పుడే అసలు కథలో తీసుకెళ్ళాడు దర్శకుడు.ఇక సెకండాఫ్ లో కావలసినన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి. యాక్షన్ అండ్ ఎమోషన్స్ సీన్స్‌లో వైష్ణవ్ తేజ్ చాలా బాగా నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఉన్నంతలో సుమన్, రాధిక, తనికెళ్ళభరణి ల పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. శ్రీలీల క్యారెక్టర్ ఏదో ఉందంతే. లీలమ్మో పాట మాత్రం మాస్ ఆడియన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది. మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కి రప్పిస్తుంది. ఇక గత రెండు చిత్రాలతో పోలిస్తే ఆదికేశవ వైష్ణవ్ తేజ్ కి హిట్ ఇచ్చే సినిమా అనే చెప్పాలి. మరి బాక్సాఫీస్ వద్ద ఆదికేశవ ఏ రేంజ్ హిట్ సాధిస్తుందనేది చూడాలి.