Aadhaar PAN Linking: ప్రస్తుతం వాడుతున్న లావాదేవీలు అన్ని కూడా పాన్ కార్డ్ లో లింక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆదార్ కార్డ్ అనేది మన జీవితంలో తప్పనిసరి అయిపొయింది. అది మన పౌరసత్వాన్ని నిర్ధారించే ఐడెంటిటీ కార్డు. ఇక ఉద్యోగులు, వ్యాపారులకి పాన్ కార్డ్ కూడా అంతే తప్పనిసరి అయ్యింది. పాన్ కార్డ్ ద్వారానే ఆర్ధిక లావాదేవీలు అన్ని కూడా లింక్ అయ్యి జరుగుతున్నాయి. అలాగే ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ మన పాన్ కార్డ్ ఆధారంగానే మన ఆదాయాన్ని డిసైడ్ చేస్తుంది. అలాగే ఆ పాన్ కార్డు ద్వారా ఇన్ కమ్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తుంది.
ఇదిలా ఉంటే పాన్ కార్డ్ కి ఆదార్ కార్డ్ ని కచ్చితంగా లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అయితే ఎప్పటికప్పుడు దీనికి డెడ్ లైన్ పెడుతూ వచ్చింది. ఇప్పటికే దీనిపై ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన అనుసంధానం డెడ్ లైన్ అయిపొయింది. అయితే వెయ్యి రూపాయిల అపరాద రుసుముతో మార్చి 31 వరకు గడుపు ఇచ్చింది. వెయ్యి రూపాయిల ఫైన్ తో ఈ నెల ఆఖరు వరకు పాన్ కార్డుకి ఆదార్ కార్డు లింక్ చేసుకునే సదుపాయం ఉంది. ఒక వేళ ఈ డేట్ కూడా దాటిపోతే తరువాత ఆదార్ లింక్ కాని పాన్ కార్డులు అన్ని కూడా ఇన్ వేలిడ్ గా మారిపోనున్నాయి. అయితే పాన్ కార్డ్ కి ఆదార్ లింక్ చేయడం ఎలా అనేది చాలా మందికి ఇంకా అవగాహన లేదు. www.incometax.gov.in మీద క్లిక్ చేస్తే
వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో లెఫ్ట్ సైడ్ లింక్ ఆదార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అందులో మరో లింక్ ఓపెన్ అవుతుంది. దానిలో ఆదార్ నెంబర్, పాన్ నెంబర్ లని ఎంట్రీ చేయాలి.
రెండు నెంబర్స్ ని టైప్ చేసిన తర్వాత వాటిని వ్యాలీడేట్ చేయాలి. అలా చేసిన తర్వాత ఆదార్ అనుసంధానం జరుగుతుంది. ఒక వేళ మీరు ఇప్పటికే ఆదార్ అనుసంధానం చేసేసారు అని అనుకుంటే, ఇంకా అందులో ఏదైనా డౌట్ ఉంటే లింక్ ఆదార్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఆదార్ నెంబర్ తో పాటు పాన్ నెంబర్ ని ఎంటర్ చేయాలి . తద్వారా మీరు ఇప్పటికే పాన్ కార్డుకి ఆదార్ లింక్ చేసారా లేదా అనేది తెలుస్తుంది.