Sobhita Dhulipala : శోభితా ధూళిపాళ్ళ ప్రస్తుతం ఆమె రాబోయే చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2 విడుదల కోసం వేచి ఉంది. మణిరత్నం మాగ్నస్ ఓపస్, పొన్నియిన్ సెల్వన్, రెండు భాగాలుగా విడుదలైంది. ఈ చిత్రం మొదటి భాగం గత సంవత్సరం విడుదలైంది. మూవీ కి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందాయి. రెండవ భాగం ట్రైలర్, ఆడియో లాంచ్ రీసెంట్ గా జరిగింది. మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది ఈ నేపథ్యంలో ప్రొమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా శోభిత తన తాజా ఫోటో షూట్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేసింది.
శోభితా ధూళిపాళ్ళ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది, ఆమె తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్లను రోజూ అందిస్తూ రుజువు చేస్తూనే ఉంటుంది. ఏసింగ్ క్యాజువల్ లుక్స్ నుండి ఫెస్టివ్ ఎంసెట్‌ల వరకు, శోభిత ఫ్యాషన్ డైరీలు వైవిధ్యంగా ఉంటాయి. ఆమె ఇన్ స్టాలో ఫ్యాషన్ ఇన్‌స్పోలు అనేకం ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ మరొక రూపంతో నెట్టింట్లో మంటలు రేపింది.
శోభిత తాజా ఫోటోషూట్ కోసంబంగారుతెల్ల రంగు చీరను ఎంచుకుంది.చిరకట్టులో తన మేజర్ ఫ్యాషన్ ఇన్‌స్పోను అందిస్తూ ఆమె అభిమానులను ఉర్రూతలూగించింది. ట్రాన్సపరెంట్ శారీ లో సొగసులు అరబోసింది. కైపెక్కించే లుక్స్ తో అందరిని కట్టి పడేసింది.
శోభిత లేస్ వర్క్ తో డిజైన్ చేసిన ఈ అద్భుతమైన చీరను ఫోటో షూట్ కోసం ఎంచుకుంది. శోభిత బోర్డర్ల వద్ద వచ్చిన లేస్ స్పెషల్ అట్రాక్షన్ ను అందించాయి. ఈ చీరలో చాలా అందంగా కనిపించింది. శోభిత తన చీరను దారాలతో భారీగా ఎంబ్రాయిడరీ చేసిన వైట్ కలర్ బ్లౌజ్‌తో జత చేసింది.
శోభిత గ్రీన్ కలర్ రాళ్ళ తో చేసిన సొగసైన భారీ నెక్ చైన్ ను, స్టేట్మెంట్ చెవిపోగులు , గాజులను అలంకరించుకుని తన రూపాన్ని మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది. గజిబిజిగ ఉంగరాల జుట్టును లూస్ గా వదులుకుంది. మినిమల్ మేకప్‌లో, శోభిత తన లుక్‌ని పర్ఫెక్ట్గా మార్చింది. నటి తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ కోహ్ల్,కనురెప్పలకు మస్కరాతో పాటు , పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని అందరిని మెస్మ రైజ్ చేస్తోంది.