Health Tips: సాధారణంగా మనం ఆహారంగా తీసుకొని ఆకకూరలు, కూరగాయల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ప్రజలు వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల భారీన పడకుండా కాపాడుకోవచ్చు. మనకి అందుబాటులో ఉన్న కూరగాయలలో మునగకాయ కూడా ఒకటీ. వేసవి కాలంలో మునగకాయలు విరివిగా లభిస్తాయి. ఈ మునగకాయాలు ఆహారంగా మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. మునగాకులో ఉండే విటమిన్లు,ఖనిజాలు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతో సహకరిస్తాయి.
ఇక మునగ గింజలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. జలుబు మరియు గొంతు నొప్పి తో బాధపడుతున్నట్లైతే మునగకాయ సూప్ తీసుకోవటం వల్ల జలుబు, గొంతు నొప్పి నుండి త్వరిత ఉపశమనం కలుగుతుంది. ఇక వీటిలో ఉండే ఇనుము, విటమిన్లు మరియు కాల్షియం ఎముకలు కండరాలు దృఢంగా ఉంచుతాయి. మునగకాయలు తినటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా నియంత్రించవచ్చు. అలాగే ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా మునగ గింజలు ఎంతో ఉపయోగపడతాయి.
Health Tips:
మునగకాయ గింజలను తీసుకోవడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుంది. అంతే కాకుండా చర్మం కాంతివంతంగా ఉండటమే కాకుండా జుట్టు కూడా బాగా పెరుగుతుంది. అంతే కాకుండా వాపు వల్ల వచ్చే వ్యాధులకు మునగ గింజలు మంచి ఔషధం లాగా పని చేస్తాయి. ప్రతీ రోజూ ఒక టేబుల్ స్పూన్ ఈ గింజలను తీసుకుంటే ఏ రోగాలు కూడా దరి చేరవు. అలాగే ఈ గింజలను నేరుగా తినలేని వారు పొడి చేసుకొని ఒక గ్లాస్ నీటిలో 1 టేబుల్ స్పూన్ పొడిని కలిపి తీసుకుంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల ఎటువంటి రోగాలు దరిచేరవు.