Cyber Crime: డిజిటల్ లావాదేవీలు ఇండియాలో చాలా వేగంగా పెరిగాయి. ఎవరైనా డబ్బులు ఒకరి నుంచి మరొకరికి పంపించడానికి, అలాగే వస్తువులు కొనుగోలు చేసే సమయంలో డబ్బులు చెల్లించడానికి డిజిటల్ యాప్ లని ఉపయోగిస్తూ ఉన్నాం. యూపీఐ పేమెంట్ సిస్టమ్ ప్రస్తుతం ఇండియాలో అత్యంత సులభమైన మనీ ట్రాన్స్ ఫర్ విధానంగా మారింది. అందుకె గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం లాంటి పేమెంట్ యాప్స్ ద్వారా డబ్బులు చెల్లించే అలవాటు చేసుకున్నాం ఇండియా సుమారు 70 శాతం వరకు ప్రజలు డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ని వినియోగిస్తున్నారు. ఇదే సైబర్ క్రిమినల్స్ కి వరంగా మారింది. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే రోడ్ల మీదకి వెళ్లి వ్యాలెట్ కొట్టేయడం, లేదంటే బ్యాంక్ లని లోటీ చేయడం. ఏటీఎంలని ఎత్తుకుపోవడం వంటివి చేసేవారు. అయితే ఇప్పుడు స్మార్ట్ గా దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు.
టెక్నాలజీని తప్పుడు మార్గాలలో వినియోగిస్తూ మన అకౌంట్ లో డబ్బులు మనకి తెలియకుండా మనమే వారికి చెల్లించేలా చేసుకుంటున్నారు దీనికోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలని ఎంచుకుంటున్నారు. ప్రజలకి ఉన్న చిన్న చిన్న ఆశలని అవకాశంగా మార్చుకొని సైబర్ క్రిమినల్ మన అకౌంట్ లో డబ్బులు దోచేస్తున్నారు. వాటిలో కొన్ని చూసుకుంటే మన ఫోన్ ని శాలరీ ఎమౌంట్ క్రెడిట్ అయినట్లుగా ఒక మెసేజ్ వస్తుంది. ఉద్యోగులు కంపెనీలు చెల్లించే మొత్తంకి దగ్గరగా ఆ ఎమౌంట్ ఉంటుంది. దానిలో ఒక లింక్ కూడా పెడతారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్టర్ గా అది ఫోన్ పే కి కనెక్ట్ అవుతుంది. అక్కడ లాక్ అడుగుతుంది. లాక్ కొత్తగానే ఆ మెసేజ్ లో ఉన్న ఎమౌంట్ మొత్తం కట్ అయిపోతుంది. అలాగే మీకు ఫ్రీ అప్రూవల్ లోన్ వచ్చింది అంటే కొన్ని లింక్స్ వస్తాయి. అందులో లోన్ కావాలంటే లింక్ క్లిక్ చేయమని ఉంటుంది.
ఇక ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ లో ఉన్న డబ్బులు మాయం. కొంతమంది వాట్సాప్ కి మెసేజ్ లు పెడతారు. వర్క్ ఫ్రమ్ హోం జాబ్ ఆఫర్ చేస్తున్నాం… యుట్యూబ్ లో మేము పంపించిన చానల్స్ ని అ లైక్ చేసి, సబ్ స్క్రైబ్ చేస్తే మీరు రోజుకి 3 వేల నుంచి 7 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఏ రోజు పేమెంట్ అదే రోజు ఉంటుంది అని మెసేజ్ వస్తుంది. నిజమే అని వారితో సంభాషణ మొదలు పెట్టి వారు ఇచ్చిన లింక్స్ ఓపెన్ చేసి వారు చెప్పినట్లు చేస్తే తరువాత డబ్బులు వేయాలంటే జీఎస్టీ కట్టాలి మేము లింక్ పెడతాం దానికి కొంత ఎమౌంట్ పంపించండి అని చెబుతారు. అలా చేస్తే ఇక అకౌంట్ లో డబ్బులు ఖాళీ చేసేస్తారు.
లాగే డేటింగ్ యాప్ లు కూడా మరో రకమైన మోసానికి పాల్పడుతున్నాయి. అమ్మాయిల ఫోటోలు పంపించి టెంప్ట్ చేసి ఏదో సంబంధం లేని అడ్రెస్స్ పంపిస్తారు. అడ్వాన్స్ పేమెంట్ అని చెప్పి ట్రాన్స్ ఫర్ చేయమంటారు. దానికోసం లింక్ పంపిస్తారు. అలా చేసామా ఇక డబ్బులు గోవిందా.. ఇలా విభిన్న మార్గాలలో సైబర్ నేరగాళ్ళు ఆన్ లైన్ ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారు. అలాగే +2, +1 లాంటి సీరియల్ నెంబర్స్ తో ఫోన్స్ వచ్చాయి. లోక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అని చెబుతారు. నిజమని నమ్మేసి వారి సూచనలు ఫాలో అయితే డబ్బులు మనచేత్తో వారికి అప్పగించినట్లే.