Jacqueline Fernandez : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వెస్ట్రన్ లుక్ తో అదరగొడుతోంది. తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం ఈ బ్యూటీ ధరించిన అవుట్ ఫిట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. లక్స్ గ్రీన్ కట్ అవుట్ డ్రెస్ వేసుకుని తన అందాలను ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాక్విలిన్ తాజాగా ఈ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ మోడర్న్ డ్రెస్ లో అమ్మడి అందాలు అదుర్స్ అంటూ నెట్టింట్లో ఫ్యాన్స్ లైకులు, కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం జాక్వెలిన్ ఈ అందమైన డ్రెస్ ను ఎంచుకుంది. టాప్ లో నాభి వరకు వచ్చిన డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ డీటెయిల్స్, నడుము దగ్గర వచ్చిన ఫ్రిల్స్ అవుట్ ఫిట్ కి అమేజింగ్ లుక్ అందించాయి. ఈ డ్రెస్ లో జాక్వెలిన్ అందాల ఒళకాబోతలో హద్దు దాటింది. మెడలో సిల్వర్ నెక్లెస్, చేతివేళ్ళకు ఉంగరాలు పెట్టుకుని ఆదరగొట్టింది.
2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకంగా ఎన్నికైన తర్వాత అదే సంవత్సరం మిస్ యూనివర్స్ పోటీలకు కూడా వెళ్ళింది. ఆ తర్వాత సిడ్నీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన జాక్వెలిన్ శ్రీలంకలో ఒక టీవీ రిపోర్టర్ గా కూడా పనిచేస్తుంది. ఈ భామ అనంతరం మోడలింగ్ వైపు తన ఇంట్రెస్ట్ చూపించింది.
బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు రావడంతో సినిమా రంగంలోనూ అడుగులు వేసింది. జాక్వెలిన్ సినిమా హీరోయిన్ గా కన్నా ప్రత్యేక గీతాల ద్వారానే పాపులారిటీని సంపాదించుకుంది. విక్రాంత్ రోనా, హౌస్ ఫుల్, బూత్ పోలీస్, బచ్చన్ పాండే, రామసేతు వంటి హిట్ సినిమాల్లోనూ కీలకపాత్రలో కనిపించి ఫ్యాన్స్ ను తన నటనతో ఇంప్రెస్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హర హర వీరమల్లు లోను ఈ అమ్మాయి ప్రత్యేక సాంగ్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఓవైపు సినిమాలు మరోవైపు స్పెషల్ సాంగ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ లోను నటిస్తూ తన క్రేజ్ ను కంటిన్యూ చేస్తోంది జాక్వెలిన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఫాలో అయ్యే ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లతోనూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. తన అందాలతో అందరి చూపులు తన వైపుకు తిప్పుకుని మాయ చేస్తోంది.