Technology: ఇంజనీరింగ్ చదువులు పూర్తిచేసుకుని సాఫ్ట్వేర్ రంగంలో సెటిలై ఐదు అంకెల జీతాన్ని తీసుకోవాలని యువత కలలు కంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వారు కెరియర్ ప్లానింగ్ చేసుకొని సాఫ్ట్వేర్ కోర్సులను పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాలు సాధిస్తూ ఉంటారు. అయితే ఈ ఐటీ రంగంలో ఉద్యోగాలు అనేవి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అనే విధంగా తయారయ్యాయి. ప్రపంచ మార్కెట్లో ఆర్థిక మాంధ్యం కారణంగా ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నాయి. స్టార్ట్ అప్ కంపెనీల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకు అన్నీ కూడా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా అవసరానికి మించి ఉన్న ఉద్యోగులకు మంగళం పడేస్తున్నాయి.
ట్విట్టర్లో మొదలైన ఈ ఉద్యోగులు తొలగింపు క్రమంగా అన్ని ఐటీ కంపెనీలకు పాకుతున్నాయి. ఐటీ రంగం తో పాటు ఈ కామర్స్ వ్యాపారంలో ఉన్న జొమాటో, అమెజాన్, స్విగ్గి, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా స్విగ్గిలో 380 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించడం జరిగింది. ఇక సెర్చ్ ఇంజన్ టెక్నాలజీ కంపెనీ ఆయన గూగుల్ కూడా తాజాగా 12,500 మంది ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా తొలగించడం సంచలనంగా మారింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తొలగించిన ఉద్యోగులందరికీ కూడా మెయిల్స్ ద్వారా క్షమాపణలు చెప్పి వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. 16 వారాల బోనస్, ఇంక్రిమెంట్, ఆరు నెలల హెల్త్ కేర్ బెన్ఫిట్ లు కల్పిస్తూ వాళ్లందర్నీ ఉద్యోగుల నుంచి తొలగించారు.
ఇదిలా ఉంటే తాజాగా విప్రో కంపెనీ 800 మంది ఫ్రెషర్స్ ని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు తెలుస్తుంది. వారందరికీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టి అందులో ఉత్తీర్ణులు కాని వారిని టెర్మినేట్ చేసినట్లు సమాచారం. ఆరు నెలల శిక్షణ తర్వాత కూడా పేలవమైన పనితీరును కనబరిచిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు విప్రో ప్రకటించింది. కాలేజీలలో క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక చేసిన వారిని ఇలా ఉన్నపలంగా విప్రో సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించడం సంచలనంగా మారింది. ఇదే దారిలో మరిన్ని కంపెనీలు కూడా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. మార్చి తర్వాత నుంచి ఇండియాలో కూడా ఈ ఆర్థిక మాంధ్యం ప్రభావం కంపెనీలపై ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ డౌన్ ఫాల్ ఈ ఏడాది ఆఖరి వరకు కొనసాగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.