News: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చురుకుగా పావులు కదుపుతూ ప్రజలలోకి వెళ్తున్నాడు. వీలైనంత వరకు, వీలైనన్ని సార్లు ఏదో ఒక అంశం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యామాలని చేపడుతున్నారు. పార్టీ క్యాడర్ కూడా బలంగా నియోజకవర్గాలలో ప్రజల మధ్యకి వెళ్లి జనసేనాని ఇచ్చిన పిలుపుతో ప్రజా ఉద్యమాలలో భాగం అవుతున్నారు. ప్రస్తుతం జగనన్న ఇల్లు- ప్రజలందరికి కన్నీళ్లు అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జగనన్న ఇస్తానని హామీ ఇచ్చిన హౌస్ లని పూర్తి చెయ్యలేదని, ఈ హోసింగ్ స్కీంలో పెద్ద అవినీతి జరిగిందని సోషల్ ఆడిట్ చేస్తూ ప్రత్యక్షంగా జనసేన క్యాడర్ ని గ్రౌండ్ లెవల్ లోకి పంపిస్తూ జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో క్యాంపైన్ స్టార్ట్ చేశారు.
ఇది ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతుంది. జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్స్ లో నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదని చూపించడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం జనసేనాని చేస్తున్నారు. దీనికి తిప్పి కొట్టడానికి ఈ జగనన్న ఇల్లు స్కీంలో లబ్ది పొందిన వారితో వీడియోలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జనసేన నాయకులు వెళ్లే చోటకి లబ్ధిదారులని పంపిస్తూ గలాటా సృష్టిస్తున్నారు. అలా చేసి కావాలనే జనసేన పార్టీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా గుంకలాంలో హోసింగ్ ప్రాజెక్ట్స్ ని సందర్శించి అక్కడ అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలని చూశారు. అక్కడే ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తూ తనకి ఒక్క అవకాశం ఇవ్వాలని, 2024లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని హామీ ఇచ్చారు.
అదే సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ సాగనంపాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనకి విశేషమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రజలలోకి తీసుకెళ్తున్న జనసేన పార్టీ కార్యక్రమాలకి పోటీగా ప్రభుత్వ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో చూపించాలని అనుకుంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ క్యాడర్ ని భయపెట్టడం, వారితో ప్రజలు కలవకుండా నిలువరించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. ఇంత వరకు కేసుల విషయంలో విషయంలో ఆచితూచిగా వ్యవహరించిన వైసీపీ ఈ సారి చట్టవ్యతిరేకంగా పవన్ చేపట్టే కార్యక్రమాలకి రెస్ట్రిక్షన్ పెట్టి వాటిని అతిక్రమిస్తే కేసులు పెట్టేందుకు కూడా సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికే ఇప్పటం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కారు బోనెట్ మీద కూర్చొని ప్రయాణించిన ఘటనపై ఒక కామన్ మెన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అలాగే రిషికొండలో ఏరియల్ వ్యూ విజువల్స్ తీసుకోవడం నిషేధం విధించారు. దీనికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఏరియల్ విజువల్స్ చిత్రీకరించారు. దీనిపై కూడా కేసు రిజిస్టర్ చేయాలని భావిస్తున్నారు. ఇలా కేసులలో ఇరికించి చట్టపరంగా కూడా జనసేనాని భయపెట్టే ప్రయత్నం చేయాలని వైసీపీ భావిస్తుంది. ఇప్పుడు వైసీపీ వెర్సర్ జనసేనగా ఉన్న ఈ ఏపీలో రాజకీయ పోరు ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.