Sravana Masam: శ్రావణమాసం వచ్చిందంటే చాలు మహిళలకు నెల మొత్తం పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలా ఉంటుందని చెప్పాలి. ఈ శ్రావణ మాసంలో మహిళలు ఎన్నో రకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఎవరైనా మన ఇంటికి ముత్తైదువు వస్తే వారికి తప్పనిసరిగా శ్రావణ మాసంలో పసుపు కుంకుమలతో పాటు తాంబూలం కూడా అందిస్తూ ఉంటాము. ఇక మంగళ గౌరీ వ్రతం వరలక్ష్మీ వ్రతం చేసిన తర్వాత కూడా ఇలా తాంబూలం ఇవ్వడం మనం చేస్తుంటాము.
శ్రావణ మాసంలో తాంబూలం ఇచ్చే సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. తాంబూలం ఇచ్చే సమయంలో ఈ వస్తువులు తప్పనిసరిగా తాంబూలంలో పెట్టాలని పండితులు చెబుతున్నారు. మరి తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి అనే విషయానికి వస్తే.. శ్రావణ మంగళవారం ఇచ్చే తాంబులంలో తమలపాకు,వక్క,శనగలు ఉంటాయి. ఈ వస్తువులను తప్పనిసరిగా పెట్టాలని చెబుతున్నారు.
చాలామంది తాంబూలం ఇచ్చే సమయంలో ఒక రవిక అరటి పండ్లు, పసుపు కుంకుమలతో పాటు గాజులు, పువ్వులను తాంబూలంలో పెట్టి ఇస్తున్నాము అయితే తమలపాకు ఒక్క సెనగలు కూడా కచ్చితంగా ఉండాలని చెబుతున్నారు. ఆడవారికి ఎక్కువగా కుజదోషం చంద్రదోషం ఉంటాయి. ఈ దోషాలు తొలగిపోవడానికి ఆకు ఒక్కలను తాంబూలంలో ఇవ్వాలి. ఇక గురు బలానికి శనగలను ఇస్తారు. అలాగే మారిన ఋతువులో ఉడికించిన శనగలను తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా వ్యక్తిగతంగా,ఆరోగ్యపరంగా,కుటుంబ పరంగా అన్ని రకాలుగా లాభాలు చేకూరుతాయి కనుక తాంబూలంలో ఇవి కచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.