Vastu Tips: మన హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తూ ఉంటాము. తులసి మొక్కను ఆధ్యాత్మిక పరంగాను ఎంతో పవిత్రమైనదిగా భావించి ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలోనూ పెంచి పూజిస్తూ ఉంటారు.. తులసి మొక్క మన ఇంట్లో ఉంది అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మన ఇంట్లో ఉంటాయని అర్థం అయితే ఇలాంటి దైవ స్వరూపం అయినటువంటి తులసి మొక్కను మన ఇంటి ఆవరణంలో పెట్టేటప్పుడు సరైన జాగ్రత్తలను పాటించాలని పండితులు చెబుతున్నారు.
తులసి మొక్క మన ఇంట్లో ఉన్నప్పుడు ఈ క్రింది నియమాలను పాటించి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి. ఇక తులసి మొక్క మీ ఇంటి ఆవరణంలో లేకపోతే ఇంటి ఆవరణంలో తులసి మొక్కను నాటడానికి కార్తీక మాసం ఎంతో సరైన సమయం అని చెప్పాలి. కార్తీక మాసంలో తులసి మొక్కను నాటడం శుభప్రదం. అంతేకాకుండా తులసి మొక్క నాటేటప్పుడు ఇంటికి ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశ వైపు ఉండడం ఎంతో మంచిది.
తులసి మొక్కను దక్షిణ దిశలో అసలు నాటకూడదు. ఈ దిక్కు పూర్వీకులది. అందువల్ల దక్షిణ దశలో తులసి మొక్కను నాటితే తీవ్ర ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. ఇక తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తూనే ఉంటాము అయితే పూజ చేసే ముందు తులసికి తప్పనిసరిగా నీటిని పోస్తూ ఉంటాము. ఉదయం పూజ చేసినప్పుడు మాత్రమే నీటిని పోయాలి కానీ సాయంత్రం పోయకూడదని పండితులు చెబుతున్నారు..తులసికి నీటిని సమర్పించడమే కాకుండా పచ్చి పాలను కూడా సమర్పించవచ్చు. పచ్చిపాలను సమర్పించడం వలన దురదృష్టం తొలగి అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.