Curd: సాధారణంగా మనం ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటాము. ఇలా పెరుగు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ఎన్నో ప్రోబయాటిక్స్ ఉండటం వల్ల పెరుగుతో భోజనం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు అయితే పెరుగులో సబ్జా గింజలను కలిపి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి పెరుగుతో పాటు సబ్జా గింజలను కలిపి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..
ఇటీవల కాలంలో మారిన మన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉన్నాము. ఈ క్రమంలోనే చాలామంది అధిక రక్తపోటు గుండె పోటు సమస్యలతో పాటు రక్తప్రసరణ వ్యవస్థలో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి.
ఇలా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి సబ్జా గింజలు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పాలి రాత్రంతా నానబెట్టిన సబ్జా గింజలను మరుసటి రోజు పెరుగులో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు సబ్జా గింజలలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మన సిరలలో పేరుకుపోయిన చెడు కొవ్వును మొత్తం కరిగించి రక్త ప్రసరణ వ్యవస్థకు ఎంతగానో దోహదం చేస్తుంది. తద్వారా రక్తప్రసరణ వ్యవస్థ పని తీరు మంచిగా ఉండడమే కాకుండా అధిక రక్తపోటు సమస్య నుంచి అలాగే గుండెపోటు సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలా నానబెట్టిన సబ్జా గింజలను ప్రతిరోజు ఉదయం పరగడుపున పెరుగులో కలిపి తినడం చాలా మంచిది.