Friday: సాధారణంగా శుక్రవారాన్ని చాలామంది ఎంతో పరమపవిత్రమైన దినంగా భావిస్తారు. ఆరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. అందుకే శుక్రవారం చాలామంది కలశస్థాపన చేసుకుని పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే శుక్రవారం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అలంకరించి పూజించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మనపైనే ఉంటాయని భావిస్తారు. కానీ శుక్రవారం తెలిసి తెలియక కొన్ని పనులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
శుక్రవారం ఎలాంటి పనులు చేయకూడదు ఏంటి అనే విషయానికి వస్తే.. శుక్రవారం పూజ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా దేవుడు చిత్రపటాలను తొలగించి దేవుడి మందిరం శుభ్రంగా కడిగి పూజ చేయడం ప్రారంభిస్తూ ఉంటారు. అయితే శుక్రవారం ఎట్టి పరిస్థితులలో కూడా దేవుడి ఫోటోలను దేవుడు గది నుంచి తీయకూడదు అలాగే దేవుడు చిత్రపటాలను కడిగి బుట్టలు పెట్టకూడదు. ఇలా చేయాలి అనుకుంటే ముందు రోజే వీటన్నింటిని శుభ్రం చేసి పెట్టుకోవడం మంచిది.
ఇక ఇల్లు శుక్రవారం తడి గుడ్డతో అసలు తుడవకూడదు. ఇక శుక్రవారం తలస్నానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇకపోతే శుక్రవారం ఇంట్లో లేదా షాపులలో బూజు తొలగించడం వంటివి చేయకూడదు. అదేవిధంగా శుక్రవారం ఎవరికీ పాలు పెరుగు చింతపండు వంటి వస్తువులను ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా శుక్రవారం ఈ నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మన పైన ఉంటాయి.