Chapati Dough: చాలామంది ఒకసారి చపాతి పిండిని ఎక్కువ మొత్తంలో కలిపి ఉదయం లేదా సాయంత్రం చేసుకోవడానికి పనికి వస్తుందని చెప్పి దానిని భద్రంగా ఒక బాక్స్ లో నిల్వ చేస్తూ ఫ్రిజ్లో పెడుతూ ఉంటారు అనంతరం దానిని మరుసటి రోజు లేదంటే సాయంత్రం చపాతీగా చేసుకుని తింటూ ఉంటారు. ఇలా చేయటం వల్ల సమయం ఆదా అవుతుందని చాలామంది భావిస్తుంటారు కానీ పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలా కలిపిన పిండిని ఫ్రిజ్ లో నిల్వ చేయడం చాలా ప్రమాదకరం. కలిపిన చపాతీ పిండిని ఫ్రిజ్లో నిల్వ పెట్టడం వల్ల పెద్ద ఎత్తున బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉంటాయి అలాంటి పిండితో చపాతీలు చేయడం వల్ల కడుపులో ఉబ్బరం వాంతులు, వికారం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఇలా చపాతి పిండిని ముందుగానే కలిపి ఫ్రిజ్లో పెట్టడం వల్ల అందులో ఉన్నటువంటి మినరల్స్ విటమిన్ లో పూర్తిగా నశించిపోతాయి.
ఇలాంటి పిండితో చపాతీలు చేసుకుని తినటం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏర్పడటమే కాకుండా, మలబద్ధక సమస్యలు కూడా వెంటాడుతాయి. అలాగే గ్యాస్టిక్ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక ఎవరు కూడా ముందుగానే ఫ్రిజ్లో చపాతి పిండిని కలిపి పెట్టి నిల్వ చేయకూడదని ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కలిపి తినడం వల్లే లాభాలను ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.