Wed. Jan 21st, 2026

    Garlic peel: మన భారతీయ వంటలలో ఎక్కువగా ఉపయోగించే వాటిలో వెల్లుల్లి కూడా ఒకటి ఈ వెల్లుల్లిని ప్రతి ఒక్క వంటలలోను ఉపయోగిస్తూ ఉంటారు ఇలా వంటలో ఉపయోగించడం వల్ల వంటకు రుచి వాసన రావడమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు. ఇక వెల్లుల్లి ఔషధాలు గని అని కూడా అంటారు ఎన్నో పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలు వెల్లుల్లి దాగి ఉన్నాయి వెల్లుల్లిని తరచూ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఇలా చాలామంది వెల్లుల్లి ప్రయోజనాలు ఉండటంతో వెల్లుల్లి తింటూ వాటి తొక్కను పడేస్తూ ఉంటారు.

    ఇలా వెల్లుల్లి తొక్క పడేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి వెల్లుల్లి తొక్కలో ఉన్నటువంటి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..తొక్కలని తీసేసి ఆరబెట్టాలి. ఈ పొడిని వంటల్లో కలుపుకుంటే ఆహారం రుచిగా ఉంటుంది. ఇక ఈ పొట్టును మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవడం వల్ల మొక్కలు ఎంతో ఆరోగ్యవంతంగా పెరుగుతాయి.

    ఇక చాలామంది కీళ్లు వాపు సమస్యలు అలాగే కాళ్లు వాపు సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి వెల్లుల్లి పొట్టుతో ఆహారం తినటం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.వెల్లుల్లి తొక్కను నీటిలో వేసి మరిగించి దాంతో మీ పాదాలను కడుక్కోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. వెల్లుల్లి తొక్కలో యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.. కాబట్టి దీనిని పొడిగా చేసుకుని ప్రతికూరల్లో వాడుకోవచ్చు.. కారం పొడిలో కూడా ఉపయోగించుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు.