Periods: సాధారణంగా మహిళలలో ప్రతినెల పీరియడ్స్ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమందికి పీరియడ్స్ వచ్చినప్పుడు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు మరి కొందరు తీవ్రమైనటువంటి కండరాల నొప్పి కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు మరికొందరు వికారం వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఐదు రోజులపాటు మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు.
ఇలా మహిళలు పీరియడ్స్ సమయంలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో వారికి మరి శక్తి అవసరం అవుతుంది అందుకే ఆహారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక పీరియడ్స్ సమయంలో కేఫిన్ కలిగినటువంటి ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండటం ఎంతో మంచిది. కేఫిన్ తీసుకోవాలని కోరిక మీలో కనుక కలిగే కాఫీకి బదులు టీ తాగమని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఇలాంటి సమయంలో ఆహారంలో విటమిన్లు చేర్చడం చాలా ముఖ్యం. విటమిన్ E మీ PMS లక్షణాలను ఉపశమనం చేస్తుంది. విటమిన్ ఇ పొందడానికి బటర్‌నట్ స్క్వాష్, గుడ్డు సొనలు తినండి. డార్క్ చాక్లెట్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడానికి పీరియడ్స్ అప్పుడు మంచి సమయం. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న డార్క్ చాక్లెట్ సెరోటోనిన్‌ని పెంచుతుంది. మీ మానసిక స్థితిని మెరుపు పరుస్తుంది.
పీరియడ్స్ సమయంలో మీకు తరచుగా రక్తస్రావం అవుతుంది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం రక్తహీనతతో పోరాడటానికి, కోల్పోయిన హిమోగ్లోబిన్‌ను భర్తీ చేయడంలో మీకు సహాయపడుతుంది. వీటితో పాటు పండ్లను కూడా అధికంగా తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొంది మరింత ఎనర్జీని పొందవచ్చు.